తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

పర్ఫెక్ట్​ లంచ్​ బాక్స్​ రెసిపీ "ఆమ్లా రైస్​" - ఇలా చేశారంటే మెతుకు మిగలదు! - HOW TO MAKE AMLA RICE AT HOME

తక్కువ టైమ్​లోనే అద్దిరిపోయే రెసిపీ రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం

How to Make Amla Rice at Home
How to Make Amla Rice at Home (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 25, 2024, 11:10 AM IST

How to Make Amla Rice at Home: ప్రస్తుతం మార్కెట్లో ఉసిరికాయలు విరివిగా లభిస్తున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది ఎక్కువ రోజులు వచ్చేలా ఉసిరికాయ పచ్చడి పెట్టుకుంటుంటారు. వేడి వేడి అన్నంలో కొద్దిగా ఆమ్లా, నెయ్యి వేసుకుని తింటే కలిగే మజానే వేరు. అయితే ఉసిరికాయలతో కేవలం పచ్చడి మాత్రమే కాదు.. ఎన్నో రకాల వెరైటీస్​ కూడా చేసుకోవచ్చు. అందులో ఆమ్లా రైస్​ కూడా ఒకటి. ఇది లంచ్​బాక్స్​లోకి పర్ఫెక్ట్​ డిష్. దీన్ని పిల్లలకు లంచ్​గా పెడితే మెతుకు మిగల్చకుండా పూర్తిగా తింటారు. అంత బాగుంటుంది దీని టేస్ట్​. మరి ఇక లేట్​ చేయకుండా సింపుల్​గా టేస్టీ ఆమ్లా రైస్​ చేయడానికి కావాల్సిన పదార్థాలు ? తయారీ విధానంపై మీరు ఓ లుక్కేయండి..!

కావాల్సిన పదార్థాలు:

  • బియ్యం - కప్పు
  • పసుపు - పావు టీస్పూన్​
  • ఉప్పు- రుచికి సరిపడా
  • నువ్వులు- 2 టీ స్పూన్లు
  • మిరియాలు- అర టీస్పూన్​
  • ఉసిరికాయలు - 5
  • నువ్వుల నూనె - రెండున్నర టేబుల్​ స్పూన్లు
  • ఆవాలు - 1 టీస్పూన్​
  • పల్లీలు- 3 టేబుల్​ స్పూన్లు
  • మినపప్పు- 1 టీస్పూన్​
  • పచ్చి శనగపప్పు - 1 టీస్పూన్​
  • జీలకర్ర- 1 టీ స్పూన్​
  • ఎండు మిర్చి - 2
  • పచ్చిమిర్చి - 2
  • ఇంగువ- చిటికెడు
  • కరివేపాకు - రెండు రెబ్బలు
  • సాంబార్​ పొడి - అర టేబుల్​ స్పూన్​

తయారీ విధానం:

  • ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత ఉసిరికాయలను తురిమి పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు కుక్కర్​ తీసుకుని అందులోకి కడిగిన బియ్యం, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి రెండు కప్పుల నీరు పోసి స్టవ్​ మీద పెట్టి హై ఫ్లేమ్​లో పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి స్టీమ్​ పోయిన తర్వాత మూత తీసి అన్నాన్ని చల్లార్చుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి నువ్వులు, మిరియాలు వేసి దోరగా వేయించుకోవాలి. చల్లారిన తర్వాచ కొంచెం బరకగా గ్రైండ్​ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి కడాయి పెట్టి నువ్వుల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, పల్లీలు, మినపప్పు, పచ్చి శనగపప్పు వేసి మీడియం ఫ్లేమ్​ మీద ఎర్రగా వేయించుకోవాలి.
  • తాలింపు వేగాక జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి.
  • ఆ తర్వాత ఇంగువ, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సాంబార్​ పొడి వేసి కేవలం 30 సెకన్లు వేసి స్టవ్​ ఆఫ్​ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి ముందే గ్రైండ్​ చేసుకున్న నువ్వులు, మిరియాల పొడిని వేసి కలుపుకోవాలి.
  • ఇప్పుడు అందులోకి తురుముకున్న ఉసిరి కాయ మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. అయితే ఇదంతా స్టవ్​ ఆఫ్​ చేసే చేయాలి.
  • ఆ తర్వాత తాలింపును అన్నంలో వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతే ఎంతో రుచికరంగా ఉండే ఉసిరికాయ రైస్​ రెడీ. అయితే ఉసిరికాయ మిశ్రమాన్ని అన్నంలో కలుపుకున్నప్పుడు వేడి మీద రుచి చూస్తే పులుపు అన్నానికి పట్టిందా లేదా అన్నది తెలియదు. కాబట్టి చల్లారిన తర్వాత రుచి చూసి.. ఒకవేళ పులుపు ఏమైనా తగ్గినట్లు అనిపిస్తే మరికొంచెం ఉసిరి తురుము కలుపుకోవచ్చు.
  • మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా.. అయితే ఓసారి మీరూ ట్రై చేయండి.!!

ABOUT THE AUTHOR

...view details