తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

అలర్ట్​: మీరు ఉపయోగించే కాఫీ పొడి స్వచ్ఛమైనదేనా? - FSSAI సూచనలు పాటించి క్షణాల్లో తెలుసుకోండిలా?

-కల్తీ కాఫీ పౌడర్​తో ఎన్నో అనారోగ్య సమస్యలు -కల్తీ కనిపెట్టేందుకు FSSAI సూపర్​ టిప్స్​

How to Find the Purity of Coffee Powder
How to Find the Purity of Coffee Powder (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Dec 3, 2024, 5:00 PM IST

How to Find the Purity of Coffee Powder:కాఫీ.. ఇది ఓ మూడ్ సెట్టర్. ఇది ఓ స్ట్రెస్ బస్టర్. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ఒత్తిడికి చెక్ పెట్టి, ఉత్సాహాన్ని రెట్టించే ఓ టానిక్. అందుకే చాలా మంది దీనిని ఇష్టపడతారు. ఉదయాన్నే కప్పు కాఫీ తాగితే ఆ రోజంతా యాక్టివ్​గా ఉండొచ్చని ఫీల్​ అవుతుంటారు. అయితే, ఒకప్పుడు కాఫీ అంటే ఉదయం, సాయంత్రం మాత్రమే తాగేవారు. కానీ నేటి జనరేషన్​లో ఎప్పుడుపడితే అప్పుడు కాఫీ తాగేస్తున్నారు. మెజార్టీ పీపుల్​ కాఫీతోనే తమ డే స్టార్ట్​ చేస్తున్నారు. మరి, ఇంత మంది తాగే కాఫీ పౌడర్​ స్వచ్ఛంగా ఉండాలి కదా? కానీ కల్తీ రాయుళ్లు ఈ పౌడర్​ను కూడా కల్తీ చేసి మార్కెట్లో అమ్మేస్తున్నారు. క్లే, షికోరి పౌడర్​ వంటివి కాఫీ పొడిలో కలిపి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి కల్తీ కాఫీ పొడితో ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం. అందుకే కాఫీ పొడి స్వచ్ఛతను కనుగొనేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్​ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కొన్ని సూచనలు చెబుతోంది. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

కాఫీ పొడిలో క్లే గుర్తించడం:

  • ముందుగా ఓ గాజు గ్లాస్​లోకి వాటర్​ తీసుకోవాలి.
  • అందులోకి ఓ అర టీ స్పూన్​ కాఫీ పౌడర్​ వేసి ఓ నిమిషం పాటు ఆపకుండా కలపాలి.
  • అలా కలిపిన తర్వాత ఓ 5 నిమిషాల పాటు అలానే వదిలేయాలి.
  • ఐదు నిమిషాల తర్వాత స్వచ్ఛమైన కాఫీ పొడి అయితే గ్లాసు అడుగు భాగాన క్లే కి సంబంధించిన అవశేషాలు మిగలవు.
  • అదే కాఫీ పొడి కల్తీ జరిగితే క్లే పార్టికల్స్​ నీటి అడుగు భాగాన పేరుకుపోతాయి.
Detection of Clay in Coffee Powder (FSSAI)

కాఫీ పొడిలో షికోరి గుర్తించడం:

  • ముందుగా ఓ గాజు గ్లాస్​లోకి వాటర్​ తీసుకోవాలి.
  • అందులోకి ఓ టీ స్పూన్​ కాఫీ పౌడర్​ వేయాలి.
  • స్వచ్ఛమైన కాఫీ పొడి అయితే నీటిపై తేలుతూ కొద్ది మొత్తం అడుగుకు చేరుతుంది.
  • అదే కాఫీ పొడి కల్తీ అయితే గ్లాసులో వేయగానే కలర్​ మారుతుంది. దీన్ని బట్టి అందులో షికోరి కలిసినట్లు గుర్తించాలి.
Detection of Chicory Powder in Coffee Powder (FSSAI)

ఫిల్టర్​ పేపర్‌తో.. ఫిల్టర్​ పేపర్‌తో కూడా కల్తీ కాఫీ పొడిని గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

  • ముందుగా పేపర్​పై రెండు స్పూన్ల కాఫీ పొడి వేయండి.
  • తర్వాత టీ పొడిపై కొన్ని చుక్కల వాటర్​ వేస్తుండాలి.
  • కాఫీ పొడిలో కల్తీ జరిగితే ఫిల్టర్​ పేపర్​పై మరకలు ఏర్పడుతుంటాయి. ఒకవేళ ఎటువంటి మరకలు లేకపోతే అది స్వచ్ఛమైనదని అర్థం.

కల్తీ కాఫీ పొడి తీసుకుంటే కలిగే నష్టాలు:

  • కల్తీ కాఫీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థకు హాని కలిగి, అజీర్తి, మలబద్ధకం లేదా విరేచనం వంటి సమస్యలకు దారితీయవచ్చని నిపుణులు అంటున్నారు.
  • కొన్ని కల్తీ పదార్థాల వల్ల అలర్జీలు వచ్చే అవకాశం ఉందని.. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు, చర్మం దురద, ఉబ్బసం వంటివి తీవ్రమైన అలర్జీల లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు.
  • కల్తీ కాఫీలోని కొన్ని రసాయనాలు తలనొప్పికి కారణం కావచ్చని చెబుతున్నారు.
  • కొన్ని కల్తీ పదార్థాలు కాలేయం, మూత్రపిండాలకు హాని కలిగించి దీర్ఘకాలికంగా ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని చెబుతున్నారు.

'కల్తీ కారం తింటే క్యాన్సర్​ వచ్చే అవకాశం' - మీ ఇంట్లో వాడే చిల్లీ పౌడర్​ని ఇలా టెస్ట్ చేయండి!

అలర్ట్​: మీరు ఉపయోగించే మసాలాలు స్వచ్ఛమైనవేనా? - FSSAI సూచనలు పాటించి క్షణాల్లో తెలుసుకోండిలా!

ABOUT THE AUTHOR

...view details