తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

'తొక్కలో పచ్చడి' మీరెప్పుడైనా తిన్నారా? తెలుగు వారి స్పెషల్ రెసిపీ ఒక్కసారి టేస్ట్ చేయండి! - THOKKALO PACHADI RECIPE

-ఈ పొట్టును డస్ట్ బిన్​లో పడేస్తున్నారా? -తొక్కతో పచ్చడి ఎలా చేయాలో తెలుసా?

Thokkalo Pachadi in Telugu
Thokkalo Pachadi in Telugu (ETV Bharat)

By ETV Bharat Lifestyle Team

Published : Jan 11, 2025, 3:58 PM IST

Thokkalo Pachadi in Telugu:'మొక్కే కదా అని తీసేస్తే పీక కోస్తా'.. ఇదో తెలుగు సినిమా డైలాగ్​. ఇప్పుడు ఇదేందుకు చెబుతున్నారు అని ఆలోచిస్తున్నారా..? ఇప్పుడు చెప్పబోయే రెసిపీకి ఈ డైలాగ్​ సూపర్​గా సెట్ అవుతుందడి అందుకే చెప్పా. మనం రోజు వంట చేసే సమయంలో కాయగూరల తొక్కలను తీసేసి కట్ చేసి వండుకుంటాం. తొక్కే కదా వాటితో ఏం చేసుకుంటాం అని తీసి పారేస్తాం. కానీ ఈ విషయం తెలిస్తే ఇకపై అలాంటి పని చేయరు. వేస్ట్​గా పడేసే సొరకాయ తొక్కతో సూపర్ టేస్టీ పచ్చడి చేసుకోవచ్చని అంటున్నారు. అలాంటి తొక్కలో పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుని మీరు ట్రై చేసేయండి.

కావాల్సిన పదార్థాలు

  • 300 గ్రాముల సొరకాయ తొక్కలు, మధ్యలో భాగం
  • 4 టేబుల్ స్పూన్ల నూనె
  • 3 టమాటాలు
  • 12-15 పచ్చి మిరపకాయలు
  • ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు
  • ఒక టీ స్పూన్ జీలకర్ర
  • 10-12 వెల్లులి
  • కొత్తిమీర తరుగు
  • రుచికి సరిపడా ఉప్పు
  • గోళీ సైజు చింతపండు

తాళింపు విధానం

  • 3 టేబుల్ స్పూన్ల నూనె
  • ఒక టీ స్పూన్ జీలకర్ర
  • ఆర టీ స్పూన్ ఆవాలు
  • ఒక టీ స్పూన్ శనగపప్పు
  • ఒక టీ స్పూన్ మినపప్పు
  • పావు టీ స్పూన్ ఇంగువా
  • ఒక ఎండు మిరపకాయ
  • 2 రెబ్బల కరివేపాకు
  • పావు టీ స్పూన్ పసుపు

తయారీ విధానం

  • ముందుగా స్టౌ ఆన్ చేసి ఓ కడాయిలో నూనె పోసి వేడి చేసుకోవాలి.
  • ఆ తర్వాత శనగపప్పు వేసి ఎర్రగా వేపుకొని.. అనంతరం జీలకర్ర వేసి చిటపటమనిపించాలి.
  • ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసి మెత్తబడిన తర్వాత టమాటా ముక్కలు, చింతపండు వేసి కాసేపు ఉడికించుకోవాలి.
  • ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్​లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
  • మరోవైపు అదే కడాయిలో నూనె వేడి చేసి వెల్లుల్లి రెబ్బలు, సొరకాయ తొక్క, మధ్యలో ఉండే భాగం వేసి మెత్తగా మగ్గించుకోవాలి.
  • ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని అదే మిక్సీ జార్​లో వేసి కాస్త ఉప్పు వేసి కచ్చాపచ్చాగానే గ్రైండ్ చేసుకోవాలి.

తాళింపు విధానం

  • తాళింపు కోసం స్టౌ ఆన్ చేసి నూనె పోసి వేడి చేసుకోవాలి.
  • ఆ తర్వాత ఇందులోనే జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, పసుపు, ఇంగువా, ఎండు మిరపకాయ, కరివేపాకు వేసి వేయించుకోవాలి.
  • ఇవన్నీ వేగాక గ్రైండ్ చేసుకున్న పచ్చడి మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలపాలి.
  • ఇక చివర్లో కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేసుకుంటే అద్దిరిపోయే తొక్కలో పచ్చడి రెడీ!

8 నిమిషాల్లోనే ఘుమఘుమలాడే "చికెన్​ బిర్యానీ" - నమ్మలేని నిజం - ఆ సీక్రెట్ ఇదే!

చలికాలంలో మోకాళ్లు, కీళ్ల నొప్పులను తగ్గించే సూపర్​ లడ్డూ - ఇలా చేసుకుంటే టేస్ట్​ అదుర్స్​!

ABOUT THE AUTHOR

...view details