Minumula Pulagam Recipe in Telugu: ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మినుముల పులగం ఎప్పుడైనా తిన్నారా? చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఎంతో పుష్టిని ఇచ్చే వంటకం. ఇది డయాబెటిస్ ఉన్నవారికి, బరువు తగ్గాలని అనుకునే వారికి మంచిదని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఇందులోని మినుములు షుగర్ లెవల్స్ అదుపులో ఉంచడానికి సహాయం చేస్తుందని చెబుతున్నారు. 2017లో Journal of Clinical and Diagnostic Researchలో ప్రచురితమైన "Effect of Black Gram (Vigna mungo) on Glycemic Control and Insulin Sensitivity in Patients with Type 2 Diabetes Mellitus" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది.(రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఇంకా ఇందులోని క్యాల్షియం ఎముకలను బలంగా చేస్తుందని తెలిపారు. ఈ మినుముల పులగాన్ని ఏదైనా రోటీ పచ్చడి, పప్పు, పప్పు చారు, మజ్జిగతో ఎంతో రుచిగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మినుముల పులగం చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
- అర కప్పు పొట్టు మినపప్పులు
- అర కప్పు కడిగిన బియ్యం
- ఒక టీ స్పూన్ మెంతులు
- 6-7 వెల్లుల్లి
- రుచికి సరిపడా ఉప్పు
- అర కప్పు పచ్చి కొబ్బరి తురుము
- ఒక టేబుల్ స్పూన్ నువ్వుల నూనె
- 2 పచ్చి మిరపకాయలు
- అర టీ స్పూన్ జీలకర్ర
- 2 రెబ్బల కరివేపాకు