ETV Bharat / lifestyle

పులిహోర కలుపుతున్నారా? ఈ టిప్స్ పాటిస్తేనే సూపర్ టేస్ట్! మీరు ట్రై చేయండి! - HOW TO MAKE CHINTAPANDU PULIHORA

-ఇలా చేస్తే చింతపండు పులిహోర రుచిగా వస్తుందట! -లంచ్ బాక్స్, ప్రయాణాలు చేసేవారికి బెస్ట్ ఆప్షన్!

how to make chintapandu pulihora
how to make chintapandu pulihora (ETV Bharat)
author img

By ETV Bharat Lifestyle Team

Published : Jan 28, 2025, 5:25 PM IST

How to Make Chintapandu Pulihora: గుడికి వెళ్లినప్పుడు, పండగల సమయంలోనే కాకుండా మాములుగా కూడా పులిహోర తినడానికి ఇష్టపడతారు. చాలా మంది నిమ్మకాయ, చింతపండుతో పులిహోర చేసుకుని తింటుంటారు. అయితే, నిమ్మకాయతో నిమిషాల్లోనే చేసుకోవచ్చు. కానీ, చింతపండు పులిహోర చేసుకోవాలంటే ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి. కానీ, దీనిని ఒక్కసారి చేసి పెట్టుకుంటే 10 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నంలో కలుపుకొని పులిహోర హాయిగా తినవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఇందులోకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

మసాలా పొడి కోసం కావాల్సిన పదార్థాలు

  • ఒక టీ స్పూన్ శనగపప్పు
  • ఒక టీ స్పూన్ మినపప్పు
  • పావు టీ స్పూన్ మిరియాలు
  • పావు టీ స్పూన్ మెంతులు
  • ఒక టీ స్పూన్ నువ్వులు
  • 2 టీ స్పూన్ల ధనియాలు
  • 5 ఎండుమిరపకాయలు
  • పావు టీ స్పూన్ ఇంగువా

చింతపండు పేస్ట్ కోసం కావాల్సిన పదార్థాలు

  • ఒక కప్పు చింతపండు రసం
  • 3 టేబుల్ స్పూన్ల నువ్వులు నూనె
  • ఒక టీ స్పూన్ ఆవాలు
  • ఒక టీ స్పూన్ శనగపప్పు
  • ఒక టీ స్పూన్ మినపప్పు
  • గుప్పెడు వేరుశెనగలు
  • 4 ఎండుమిరపకాయలు
  • పావు టీ స్పూన్ ఇంగువా
  • 2 రెబ్బల కరివేపాకు
  • అర టీ స్పూన్ పసుపు
  • రుచికి సరిపడా ఉప్పు
  • కొద్దిగా బెల్లం
  • అన్నం

తయారీ విధానం

  • ముందుగా స్టౌ ఆన్ చేసి ఓ ప్యాన్​ పెట్టుకుని అందులో శనగపప్పు, మినపప్పు, మిరియాలు, మెంతులు, నువ్వులు, ధనియాలు, ఎండు మిరపకాయలు వేసి నూనె లేకుండానే డ్రై రోస్ట్ చేసుకోవాలి.
  • ఇవి కొద్దిగా బంగారు రంగులోకి మారిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి ఇంగువా వేసి కలిపాలి.
  • ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని ఈ మిశ్రమాన్ని పొడి చేసుకోవాలి.
  • ఇప్పుడు చింతపండును తీసుకుని నీళ్లతో కలిపి సుమారు ఒక కప్పు రసం పిండి శుభ్రంగా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి.
  • అనంతరం స్టౌ ఆన్ చేసి పాన్ తీసుకుని అందులో నువ్వుల నూనె పోసి వేడి చేసుకోవాలి.
  • ఇందులో ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, వేరుశనగలు, ఎండుమిరపకాయలు, ఇంగువా, కరివేపాకులు, పసుపు వేసి లో ఫ్లేమ్​లో వేయించుకోవాలి.
  • తాళింపు చక్కగా వేగిన తర్వాత ఇందులో చింతపండు రసం పోసి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్​లో ఉంచి చిక్కగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి.
  • ఆ తర్వాత ఇందులో ఉప్పు, బెల్లం, ముందుగా చేసుకున్న పొడి వేసి లో ఫ్లేమ్​లో 10-15 నిమిషాల పాటు నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి.
  • ఇప్పుడు ఒక గిన్నెలో అన్నం తీసుకుని అందులో చింతపండు రసాన్ని వేసి బాగా కలిపితే టేస్టీ పులిహోర రెడీ! 20-30 నిమిషాల తర్వాత తీసుకుంటే సూపర్​గా ఉంటుంది.

అందం, ఆరోగ్యాన్నిచ్చే 'రాగి ఉప్మా'- మీరు ఎప్పుడైనా తిన్నారా? షుగర్, అధిక బరువుకు చెక్!

ఇంట్లోనే పెళ్లిల స్పెషల్ స్వీట్ 'కద్దూ కీ ఖీర్'- ఇలా చేస్తే గిన్నె మొత్తం ఖాళీ చేసేస్తారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.