తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

మీకు ఈ అలవాట్లు ఉన్నాయా? రోజూ ఇలా చేస్తే బ్యూటిఫుల్​గా కనిపిస్తారట! - DAILY ROUTINE FOR ACNE SKIN

-సింపుల్ హ్యాబిట్స్ పాటిస్తే ఫేస్ క్లీన్ అవుతుందట! -ఇలా చేస్తే మొటిమలు, నల్ల మచ్చలు మాయం!

Daily Routine for Acne Skin
Daily Routine for Acne Skin (Getty Images)

By ETV Bharat Lifestyle Team

Published : Jan 17, 2025, 1:01 PM IST

Daily Routine for Acne Skin: మనలో కొంతమంది ముఖంపై ఎంత వెతికినా ఒక్క మొటిమ, నల్లమచ్చ కూడా కనిపించదు. ఎలాంటి మేకప్‌ వేసుకోకుండానే న్యాచురల్‌ బ్యూటీస్‌గా కనిపిస్తుంటారు. ఇలాంటి వాళ్లను చూస్తే.. అందం కోసం ఎన్నెన్ని సౌందర్య చికిత్సలు తీసుకుంటారో అనుకుంటారు. కానీ, నిజానికి ఎలాంటి చికిత్సలు, చిట్కాల్లో లేకుండానే.. వారు పాటించే రోజువారీ అలవాట్లతో అందాన్ని పొందవచ్చని నిపుణులు అంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. అవేంటో తెలుసుకొని మనమూ పాటించేద్దామా?!

ఉదయం నిద్ర లేవగానే, రాత్రి పడుకునే ముందు ఈ రెండు సందర్భాల్లో ముఖం శుభ్రపరచుకునేవారు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే, ముఖంపై మొటిమలు రావడానికి ఈ నిర్లక్ష్యమూ ఓ కారణమేనని నిపుణులు అంటున్నారు. అందుకే ఈ రెండు సందర్భాలతో పాటు చెమట ఎక్కువగా వచ్చినప్పుడు కూడా తప్పనిసరిగా ముఖం శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఫలితంగా ముఖంపై దుమ్ము, జిడ్డుదనం తొలగిపోయి చర్మ రంధ్రాలు మూసుకుపోకుండా చేసి మొటిమలూ ఏర్పడవని వివరిస్తున్నారు. అయితే ఈ క్రమంలో చర్మతత్వానికి సరిపడే ఫేస్‌వాష్‌ను ఎంచుకోవడమూ ముఖ్యమేని చెబుతున్నారు. 2018లో Journal of Clinical and Aesthetic Dermatologyలో ప్రచురితమైన "The importance of facial cleansing in acne prevention" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

పబ్లిక్‌ టాయిలెట్‌ కంటే మొబైల్‌ స్క్రీన్‌ ఎక్కువ అపరిశుభ్రంగా ఉంటుందని పలు అధ్యయనాల్లో తేలింది. ముఖ్యంగా ఫోన్‌ మాట్లాడేటప్పుడు, మొబైల్‌ను తాకిన చేతులతోనే ముఖాన్ని తడుముకోవడం వల్ల ఈ క్రిములు మొహంపైకి చేరి మొటిమలకు కారణమవుతాయని అంటున్నారు. ఈ సమస్య దరిచేరకుండా ఉండాలంటే ఫోన్‌ స్క్రీన్‌ను ఎప్పటికప్పుడు శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవడం తప్పనిసరని నిపుణులు సూచిస్తున్నారు.

కొంతమందికి చేతుల్ని పదే పదే ముఖానికి తాకించే అలవాటు ఉంటుంది. ఫలితంగా చేతులకు ఉన్న క్రిములు, మురికి ముఖం పైకి చేరి మొటిమలకు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే ముఖం కడుక్కునేటప్పుడు తప్ప అసలు చేతుల్ని ముఖానికి తాకించకుండా జాగ్రత్తపడాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.

ఇంకా మన చర్మం, జుట్టు కుదుళ్లలో ఉన్న జిడ్డు దిండు కవర్ల పైకి చేరి.. వాతావరణంలోని దుమ్మును ఆకర్షిస్తుంది. ఈ అపరిశుభ్రమైన దిండ్లనే వారాల తరబడి వాడడం, ఇతరులు వీటిని ఉపయోగించడం వల్ల ముఖంపై మొటిమలు వస్తాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి వారానికోసారైనా దిండ్ల కవర్లను మార్చుకోవాలని సూచిస్తున్నారు. ఇంకా ఎవరి దిండు వారే వాడుకోవడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.

మొటిమల బాధ లేకుండా ఉండాలంటే రోజువారీ తీసుకునే ఆహారం విషయంలోనూ కచ్చితంగా వ్యవహరించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఈ క్రమంలో కాయగూరలు, ఆలివ్ నూనె, తృణ ధాన్యాలు, తక్కువ మొత్తంలో మాంసం వంటివి తీసుకోవాలని సూచిస్తున్నారు. వీటి ద్వారా చర్మానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయని నిపుణులు వివరిస్తున్నారు.

ఇంకా అధిక బరువు కూడా మొటిమల సమస్యకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో వీరి శరీరంలో ఆండ్రోజెన్లు, ఇన్సులిన్‌ స్థాయులు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. ఇవి మొటిమలు రావడానికి కారణమవుతాయని వివరిస్తున్నారు. కాబట్టి బరువును అదుపులో ఉంచుకోవడం వల్ల ఆరోగ్యమే కాకుండా.. అందం కూడా మెరుగవుతుందని అంటున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మీ ముఖం జిడ్డుగా ఉంటుందని బాధపడుతున్నారా? సింపుల్ హోమ్ టిప్స్ పాటిస్తే ఆయిల్ స్కిన్ పోతుందట!

మొటిమలు, మచ్చలకు చెరకు రసంతో చెక్! చర్మం కాంతివంతం అవుతుందట!

ABOUT THE AUTHOR

...view details