ETV Bharat / lifestyle

మీ ముఖం జిడ్డుగా ఉంటుందని బాధపడుతున్నారా? సింపుల్ హోమ్ టిప్స్ పాటిస్తే ఆయిల్ స్కిన్ పోతుందట! - HOW TO GET RID OF OILY SKIN

జిడ్డు చర్మంతో ఇబ్బంది పడుతున్నారా? ఇంట్లోని పదార్థాలతో ఈజీగా తగ్గించుకోవచ్చట!

Oil Skin Remove Tips in Telugu
Oil Skin Remove Tips in Telugu (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : 4 hours ago

Oil Skin Remove Tips in Telugu: కాలంతో సంబంధం లేకుండా కొంతమంది చర్మం ఎప్పుడూ జిడ్డుగానే కనిపిస్తుంటుంది. ముఖ్యంగా చలికాలంలో అయితే, ఇంకాస్త ఎక్కువగా ఈ సమస్య వేధిస్తుంటుంది. ఇలాంటి వారు మాయిశ్చరైజర్‌ రాసుకోవాలన్నా కూడా ఇబ్బంది పడుతుంటారు. కానీ, కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే ఈ సమస్యకు పరిష్కారం చూపొచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పసుపు: ఇందులో పుష్కలంగా ఉండే యాంటీ ఫంగల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు జిడ్డుదనాన్ని దూరం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ప్రతిరోజూ రాత్రిపూట చెంచా పసుపులో కొన్ని పాలు పోసి మెత్తటి ముద్దలా చేసుకోని ముఖం, మెడకు రాసుకోవాలని సూచిస్తున్నారు. ఇలా పెట్టుకుని పావుగంటయ్యాక కడిగేస్తే ముఖంపై పేరుకున్న జిడ్డు తొలగిపోతుందని వివరిస్తున్నారు. 2018లో Journal of Cosmetic Dermatologyలో ప్రచురితమైన "Turmeric extract and its active compound curcumin reduce sebum production in human sebocytes" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

వంటసోడా: జిడ్డు సమస్యకు వంటసోడా కూడా బాగా ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం చెంచా నిమ్మరసంలో అరచెంచా బేకింగ్‌ సోడా కలిపి మొటిమలు ఉన్న చోట పూతలా వేయాలని చెబుతున్నారు. ఆ తర్వాత తడి చేత్తో మర్దన చేసి ఆ పూతను తొలగిస్తే మృతకణాలు పోతాయని వివరిస్తున్నారు. ఇంకా మొటిమలు కూడా తగ్గుముఖం పట్టడమే కాకుండా.. అలాగే జిడ్డు సమస్య కూడా తగ్గుతుందని వెల్లడిస్తున్నారు.

ఉప్పు: ఇందుకోసం స్ప్రే సీసాలో నీళ్లు తీసుకుని అందులో చెంచా ఉప్పు వేసి.. ముఖం మీద ఆ నీటిని తరచూ స్ప్రే చేసుకుంటూ తుడుచుకోవాలని చెబుతున్నారు. ఇలా చేస్తే జిడ్డు సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుందని వివరిస్తున్నారు. అయితే, కళ్లపై మాత్రం ఆ స్ప్రే పడకుండా జాగ్రత్తపడాలని సూచిస్తున్నారు.

నిమ్మరసం: జిడ్డు చర్మతత్వం ఉన్న వారికి నిమ్మరసం చక్కగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. నిమ్మరసంలో కొన్ని నీళ్లు కలిపి అందులో దూదిని ఉండలుగా చేసి వేయాలని వివరిస్తున్నారు. కాసేపు ఆ ఉండల్ని ఫ్రిజ్‌లో ఉంచి ఆ తర్వాత బయటికి తీసి వాటితో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలని అంటున్నారు. ఇలా చేయడం వల్ల చర్మంపై మురికి తొలగిపోయి శుభ్రపడుతుందని తెలిపారు. ఇంకా చర్మానికి తేమ అందడమే కాకుండా.. జిడ్డు కూడా అదుపులోకి వస్తుందని పేర్కొన్నారు.

టమాటా: ఇందులో అధికంగా ఉండే విటమిన్‌ సి, సిట్రికామ్లం జిడ్డు సమస్యకు బాగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం టమాటా ముక్కతో ముఖంపై తరచూ మర్దన చేసుకోవాలని చెబుతున్నారు. అనంతరం పావుగంటయ్యాక చల్లటి నీళ్లతో కడిగేస్తే చర్మం తాజాగా మారడమే కాకుండా జిడ్డు తొలగిపోతుందని వివరిస్తున్నారు.

మొక్కజొన్న పిండి: ఇంకా ముఖం శుభ్రం చేసుకున్నాక మొక్కజొన్న పిండిలో కొన్ని నీళ్లు కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పదిహేను నిమిషాల తర్వాత కడిగేసుకుంటే.. చర్మంపై అదనంగా పేరుకున్న జిడ్డును తొలగిస్తుందని వివరిస్తున్నారు. ఫలితంగా మేకప్‌ వేసుకున్నా ఎక్కువ సమయం తాజాగా కనిపిస్తారని అంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మొటిమలు, మచ్చలకు చెరకు రసంతో చెక్! చర్మం కాంతివంతం అవుతుందట!

చుండ్రు సమస్యకు చెక్ పెట్టే హెయిర్ ప్యాక్స్! ఇలా చేస్తే డాండ్రఫ్​ ఈజీగా తగ్గిపోతుందట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.