Bendakaya Majjiga Pulusu Recipe: మీరు మజ్జిగ పులుసు చాలా సార్లు చేసుకుని తిని ఉంటారు. కానీ ఎప్పుడైనా.. బెండకాయ మజ్జిగ పులుసు తిన్నారా? చాలా ఈజీగా చేసుకునే ఈ పులుసు.. అన్నంలోకి చాలా సూపర్‌గా ఉంటుంది. ఇంకా బెండకాయ జిగురు అంటే పడని వారు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఇందులోకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్ధాలు
- 200 గ్రాముల బెండకాయ ముక్కలు
- అర లీటర్ చిలికిన పెరుగు
కొబ్బరి పేస్టు కోసం కావాల్సిన పదార్థాలు
- 2 టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పు
- 2 టీ స్పూన్ల బియ్యం
- 1 టేబుల్ స్పూన్ ధనియాలు
- పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు
- 1 టీ స్పూన్ జీలకర్ర
- 2 పచ్చిమిర్చి ముక్కలు
మజ్జిగ పులుసు కోసం కావాల్సిన పదార్థాలు
- పావు కప్పు నూనె
- 1 టీ స్పూన్ ఆవాలు
- 2 ఎండు మిరపకాయలు
- 2 పచ్చి మిరపకాయలు
- 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగు
- అర టీ స్పూన్ పసుపు
- 2 రెబ్బల కరివేపాకు
- 2 చిటికెల ఇంగువా
- రుచి సరిపడా ఉప్పు
- 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు
తయారీ విధానం
- ముందుగా శనగపప్పు, బియ్యం శుభ్రంగా కడిగి సుమారు గంట పాటు నానబెట్టుకోవాలి.
- ఆ తర్వాత మిక్సీలో నానబెట్టిన శనగపప్పు, బియ్యం, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, కొన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- మరోవైపు స్టౌ ఆన్ చేసి కడాయిలో నూనె వేడి చేసి బెండకాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఎర్రగా వేపి పక్కకు పెట్టుకోవాలి. (మధ్య మధ్యలో కలుపుకోకపోతే బెండకాయలు అడుగు అంటతాయి)
- ఆ తర్వాత అదే గిన్నెలో ఇంకాస్త నూనె వేడి చేసి ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర వేసి ఎర్రగా వేయించుకోవాలి.
- అందులోనే అల్లం, పసుపు, కరివేపాకు, ఇంగువా వేసి వేయించుకోవాలి.
- ఇవన్నీ వేగాక మెత్తగా రుబ్బుకున్న శనగపప్పు -కొబ్బరి పేస్టు వేసి కొంత పక్కకు పెట్టుకోవాలి.
- ఆ తర్వాత ఇందులోనే అర కప్పు నీళ్లు పోసి గడ్డలు లేకుండా బాగా కలిపి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి.
- మరోవైపు చిలికిన పెరుగులో మిగిలిన శనగపప్పు పేస్ట్ వేసి బాగా కలిపి ఇందులో పోసుకోవాలి.
- ఆ తర్వాత అర లీటర్ నీళ్లు, ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని గడ్డలు లేకుండా కలపాలి.
- సుమారు 8 నిమిషాల తర్వాత వేయించుకున్న బెండకాయ ముక్కలు, కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపి మూతపెట్టి 3-4 నిమిషాలు ఉడకనిస్తే టేస్టీ బెండకాయ మజ్జిగ పులుసు రెడీ!
చికెన్, మటన్‌తోనే కాదు మొక్కజొన్నలతోనూ "పులావ్" చేసుకోవచ్చు!- టేస్ట్ అద్దిరిపోతుంది!
ఏ కెఫెకి తీసిపోని చికెన్ కట్లెట్- ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! నెల రోజులు నిల్వ ఉంటుందట!!