తెలంగాణ

telangana

ETV Bharat / international

UK సార్వత్రిక ఎన్నికల ఫలితాలు- ఓటమిని అంగీకరించిన రిషి సునాక్‌- తెలుగు వ్యక్తుల ఓటమి - UK Election Results 2024 - UK ELECTION RESULTS 2024

UK Election Results 2024
UK Election Results 2024 (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Jul 5, 2024, 7:18 AM IST

Updated : Jul 5, 2024, 12:11 PM IST

UK Election Results 2024: బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో ఎగ్జిల్​ పోల్స్ అంచనాల ప్రకారం లేబర్​ పార్టీ గెలుపు దిశగా ముందుకు వెళ్తుంది. ఇప్పటి వరకు వెలువడిన ప్రాథమిక ఫలితాల ప్రకారం లేబర్​ పార్టీ ముందజలో ఉంది. ఈ ఎన్నికల్లో లేబర్​ పార్టీకి 410 సీట్లు, కన్జర్వేటివ్ పార్టీకి 131 సీట్లు వస్తాయమని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఏ పార్టీ అయినా మెజారిటీ సాధించాలంటే 326 సీట్లు అవసరం ఉంటుంది.

LIVE FEED

12:09 PM, 5 Jul 2024 (IST)

బ్రిటన్ ఎన్నికల్లో తెలుగు వ్యక్తులు ఓటమిపాలైయ్యారు. అంతర్జాతీయ వక్తగా, రచయిత తెలంగాణ సిద్ది పేట జిల్లాకు చెందిన ఉదయ్‌ నాగరాజు లేబర్​ పార్టీ తరఫున పోటీ చేసి ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. కన్జర్వేటివ్‌ పార్టీ నుంచి పోటీ చేసిన మరో తెలుగు సంతతి వ్యక్తి చంద్ర కన్నెగంటి కూడా ఓటిమిపాలయ్యారు.

10:00 AM, 5 Jul 2024 (IST)

బ్రిటన్​లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మెజారిటీ మార్క్​ను లేబర్​ పార్టీ అధిగమించింది. మొత్తం 650 స్థానాల్లో 326 చోట్ల విజయం సాధించింది.

9:46 AM, 5 Jul 2024 (IST)

  • యూకే పార్లమెంటు ఎన్నికల్లో లేబర్‌ పార్టీ విజయం
  • ఎన్నికల్లో ఓటమిని అంగీకరించిన ప్రధాని రిషి సునాక్‌
  • లేబర్‌ పార్టీ నేత కీర్ స్టార్మర్‌కు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపిన రిషి సునాక్‌
  • కన్జర్వేటివ్‌ పార్టీ ఓటమికి నేనే పూర్తి బాధ్యత వహిస్తా: రిషి సునాక్‌
  • నేడే అధికార మార్పిడి జరుగుతుందని తెలిపిన రిషి సునాక్‌
  • ఇవాళ శాంతియుత పద్ధతిలో అధికార మార్పిడి జరుగుతుంది: రిషి సునాక్‌
  • పార్టీ విజయానికి నేతలు అవిశ్రాంతంగా కృషిచేశారు : రిషి సునాక్‌

9:25 AM, 5 Jul 2024 (IST)

కన్జర్వేటివ్‌ పార్టీ నేత, భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్‌ తన ప్రత్యర్థిపై విజయం సాధించారు. మరోవైపు రిషి సునాక్ కేబినెట్ మంత్రులైన గ్రాంట్ షాప్స్, అలెక్స్ చాల్క్ ఈ ఎన్నికల్లో ఓడిపోయారు.

9:03 AM, 5 Jul 2024 (IST)

లేబర్ పార్టీ ఇప్పటి వరకు 184సీట్లు కైవసం చేసుకోగా, రిషి సునాక్​కు చెందిన కన్జర్వేటివ్ పార్టీ కేవలం 32 స్థానాల్లో గెలుపొందింది. లిబరల్‌ డెమోక్రాట్స్ 23, స్కాటిష్ నేషనల్ పార్టీ 3, ఇతరులు 11 స్థానాల్లో విజయం సాధించాయి. మొత్తం 650 సీట్లున్న బ్రిటన్ పార్లమెంట్​లో లేబర్ పార్టీ 130కి పైగా స్థానాల్లో ముందంజలో ఉంది. రిషీ సునాక్ కన్జర్వేటివ్ పార్టీ 30 చోట్ల లీడింగ్​లో కొనసాగుతోంది.

8:05 AM, 5 Jul 2024 (IST)

ఎగ్జిట్​ పోల్స్ అంచనాల ప్రకారమే ఈ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని లేబర్​ పార్టీ నేత కీర్‌ స్టార్మర్‌ అభిప్రాయపడ్డారు. బ్రిటన్ ప్రజలు మార్పు కోరుకున్నారని చెప్పారు. తమ పార్టీపై నమ్మకం ఉంచినందుకు ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు.

7:17 AM, 5 Jul 2024 (IST)

బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్​ పార్టీ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. సుందర్​ల్యాండ్​లో 18,847 ఓట్ల మెజారిటీతో లేబర్​ పార్టీ గెలుపొందింది. కన్జర్వేటివ్ పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది.

Last Updated : Jul 5, 2024, 12:11 PM IST

ABOUT THE AUTHOR

...view details