ETV Bharat / international

హెజ్‌బొల్లాకు ఇజ్రాయెల్​ మరో చావుదెబ్బ- కీలక నేత హతం- నస్రల్లా మృతదేహం గుర్తింపు - Israel Hezbollah War

Israel Hezbollah War
Israel Hezbollah War (IANS)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 29, 2024, 3:18 PM IST

Updated : Sep 29, 2024, 7:05 PM IST

Israel Hezbollah War Live Updates : లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు కొనసాగుతున్నాయి. హెజ్‌బొల్లా స్థావరాలపై ఆదివారం కూడా ఐడీఎఫ్ వైమానిక దాడులు కొనసాగించింది. హెజ్‌బొల్లా లక్ష్యంగా డజన్ల కొద్దీ దాడులు చేసింది. ఇజ్రాయెల్ భూభాగంవైపు లాంచర్లు ప్రయోగిస్తున్న ప్రాంతాలు, ఆయుధాలను నిల్వ చేసిన భవనాలు, హెజ్‌బొల్లా మౌలిక సదుపాయాలనే లక్ష్యంగా చేసుకుంది.

LIVE FEED

10:49 PM, 29 Sep 2024 (IST)

దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 24 మంది మరణించారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. సిడాన్‌లో రెండు పక్కపక్కన ఉన్న భవనాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడిందని చెప్పింది. ఈ ఘటనలో 29 మంది గాయపడ్డారని వెల్లడించింది.

7:38 PM, 29 Sep 2024 (IST)

హెజ్‌బొల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులు చేస్తుండటంతో దక్షిణ లెబనాన్‌ నుంచి భారీ సంఖ్యలో ప్రజలు ఉత్తర దిక్కుకున్న నగరాలకు వెళ్తున్నారు. వలస వస్తున్న వారిని ఎదుర్కొనేందుకు నగదు కొరత ఉన్న తమ ప్రభుత్వం కష్టాలు ఎదుర్కొంటోందని లెబనాన్ తాత్కాలిక ప్రధాని నజీబ్ మికాటి అన్నారు. సోమవారం నుంచి ఇప్పటివరకు లక్షా 20 వేల మందికి పైగా ప్రజలు ఇళ్లు వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లారని చెప్పారు. గతేడాది నుంచి వలస వచ్చిన వారితో వారు చేరడంతో ఆ సంఖ్య పది లక్షలకు చేరిందని అంచనా వేశారు.

772 షెల్టర్లు ఏర్పాటు చేసి దాదాపు లక్షా 18 వేల మందికి ప్రాథమిక అవసరాలను అందిస్తున్నట్టు మికాటి చెప్పారు. లెబనాన్ రాజధాని అంతటా వీధిలో చెత్త కుప్పలు పేరుకుపోయాయని వ్యర్థాల నిర్వహణకు తమ ప్రభుత్వం యత్నిస్తున్నట్టు తెలిపారు. ‌అధిక సంఖ్యలో ప్రజలు ఒక చోటుకి చేరుతుండటంతో భద్రతా సమస్యలపై కూడా దృష్టిసారించినట్టు నజీబ్ మికాటి చెప్పారు.ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్‌లో 700 మందికి పైగా మరణించారు. వేలాది మంది గాయపడ్డారు.

7:04 PM, 29 Sep 2024 (IST)

హెజ్‌బొల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్‌ భీకర దాడులు కొనసాగిస్తోంది. ఈ దాడుల్లో ఇటీవల మృతి చెందిన హెజ్‌బొల్లా అధిపతి హసన్‌ నస్రల్లా మృతదేహం ఆచూకీ లభ్యమైంది. బీరుట్‌లోని దక్షిణ శివారు ప్రాంతం నుంచి తమ నాయకుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు హెజ్‌బొల్లా తాజాగా వెల్లడించింది. ఈ విషయాన్ని తాజాగా వెల్లడించింది. అయితే నస్రల్లా మృతదేహంపై ప్రత్యక్షంగా ఎలాంటి గాయాలు కనిపించలేదని సమాచారం. ఆయన శరీరంపై ప్రత్యక్షంగా ఎలాంటి గాయాలూ లేనందున బాంబు దాడి జరిగిన సమయంలో షాక్‌కి గురై ఆయన మరణించి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

5:06 PM, 29 Sep 2024 (IST)

సెంట్రల్‌ గాజాలో హమాస్‌ మిలిటెంట్లు ఉపయోగించిన సుమారు ఒక కిలోమీటరు పొడవు ఉన్న సొరంగాన్ని ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్‌ మిలటరీ తెలిపింది. ఈ సొరంగాల్లో నిర్మించిన అనేక గదులను ఆశ్రయం పొందేందుకు, ఆయుధాలను భద్రపరిచేందకు హమాస్ మిలిటెంట్లు వినియోగించినట్లు పేర్కొంది. అంతేకాకుండా గతేడాది అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌ పౌరులపై జరిగిన మారణకాండలో బందీలుగా చిక్కిన వారిని ఐడీఎఫ్‌ దళాలు గుర్తించకుండా అక్కడే దాచినట్లు తెలిపింది. నివాస భవనాల సమీపం నుంచి వెళుతున్న ఆ సొరంగాన్ని ధ్వంసం చేసిన వీడియోను ఇజ్రాయెల్‌ తాజాగా విడుదల చేసింది.

3:35 PM, 29 Sep 2024 (IST)

ఉగ్రవాద గ్రూపు హెజ్‌బొల్లాకు మరోసారి ఊహించని దెబ్బతగిలింది. ఇజ్రాయెల్‌ ఆదివారం జరిపిన వైమానిక దాడుల్లో హెజ్‌బొల్లా కీలక నేత నబిల్‌ కౌక్‌ హతమయ్యాడు. హెజ్‌బొల్లా సెంట్రల్‌ కౌన్సిల్‌లో డిప్యూటీ హెడ్‌గా ఉన్న నబిల్‌ మృతిచెందినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించింది. అయితే దీనిపై హెజ్‌బొల్లా నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

గత కొన్ని వారాలుగా లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ కొనసాగిస్తోన్న భీకరదాడుల్లో హెజ్‌బొల్లాకు చెందిన పలువురు సీనియర్‌ కమాండర్లు హతమయ్యారు. శుక్రవారం జరిగిన దాడిలో హెజ్‌బొల్లా అధినేత హసన్‌ నస్రల్లా (64) మృతి చెందడం ఆ గ్రూపునకు శరాఘతంలా మారింది. ఈ తరుణంలోనే మరో కీలక నేతను కోల్పోవడం గమనార్హం. నబిల్‌ 1995 నుంచి 2010 వరకు సౌత్‌ లెబనాన్‌లోని హెజ్‌బొల్లా మిలటరీ కమాండర్‌గా పనిచేశాడు. 2020లో అతడిపై అమెరికా ఆంక్షలు విధించింది.

Last Updated : Sep 29, 2024, 7:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.