హెజ్‌బొల్లా, ఇజ్రాయెల్ మధ్య దాడుల కారణంగా దాదాపు 10 లక్షల మంది పౌరులు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లి ఉంటారని లెబనాన్ ప్రధాని తెలిపారు. లెబనాన్ చరిత్రలోనే ఇంత మంది తరలివెళ్లడం తొలిసారని చెప్పారు. ఇప్పటివరకు హెజ్‌బొల్లా స్థావరాలపైనే దాడులు చేసిన ఇజ్రాయెల్ వైమానిక దళం తొలిసారి రాజధాని బీరుట్‌లోని నివాసాలపై బాంబులు ప్రయోగించింది. కోలా జిల్లాలోని ఓ ఆపర్ట్‌మెంట్‌పై జరిపిన దాడిలో నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. హెజ్‌బొల్లా ఉగ్రవాదులు నివాస సముదాయాల్లో తమ ఆయుధాలు, క్షిపణులను దాచిపెట్టారని, వాటిని నిర్వీర్యం చేస్తామని ఇప్పటికే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించింది. పౌరులు ఆ ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించింది. కోలా ప్రాంతంలో జరిగిన దాడిలో తమ సంస్థకు చెందిన ముగ్గురు నాయకులు మృతి చెందారని "పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా" ప్రకటించింది.
దాడుల డోస్ పెంచిన ఇజ్రాయెల్- సెంట్రల్ బీరుట్లో ఎయిర్ స్ట్రైక్- 105మంది మృతి! - Israel Intensifies Attacks Lebanon
Published : Sep 30, 2024, 12:18 PM IST
Israel Vs Hezbollah War Live Updates : హెజ్‌బొల్లా అధినేత హసన్ నస్రల్లా మరణం తర్వాత లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల డోస్ పెంచింది. హెజ్‌బొల్లా సభ్యులు, ఆయుధాలే లక్ష్యంగా దాడులను తీవ్రతరం చేసింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దళాలు ఆదివారం జరిపిన వైమానిక దాడిలో 105 మంది మృతి చెందారని లెబనాన్ ప్రభుత్వం తెలిపింది. మరో 359 మంది గాయపడ్డారని వెల్లడించింది.
LIVE FEED
సెంట్రల్ బీరుట్లులో ఇజ్రాయెల్ దాడి- ఇళ్లు వదిలిన 10లక్షల మంది