ETV Bharat / bharat

పార్లమెంట్​ వద్ద ఉద్రిక్తత- రాహుల్​ గాంధీపై బీజేపీ మహిళ ఎంపీ ఆరోపణలు! - PROTEST AT PARLIAMENT

Protest at Parliament Live Updates :
Protest at Parliament Live Updates : (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 19, 2024, 12:02 PM IST

Updated : Dec 19, 2024, 3:12 PM IST

Protest at Parliament Live Updates : అధికార, ప్రతిపక్షాల మధ్య అంబేడ్కర్‌ అంశం మరింత రాజుకుంది. ఇరుపక్షాలు పార్లమెంటు ఆవరణలో పోటాపోటీ ఆందోళన నిర్వహించాయి. ఈ క్రమంలో ఒడిశా బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగి గాయపడడం వివాదాస్పదమైంది.

LIVE FEED

3:03 PM, 19 Dec 2024 (IST)

బీజేపీ, ప్రతిపక్ష నేతల కారణంగా పార్లమెంట్ ప్రాంగణంలో నెలకొన్న గందరగోళ సమయంలో రాహుల్‌ తనను అసౌకర్యానికి గురిచేసినట్లు బీజేపీ ఎంపీ ఫంగ్నోన్ కొన్యాక్ తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై రాజ్యసభ ఛైర్మన్ జగ్​దీప్​ ధన్​ఖడ్​కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

2:25 PM, 19 Dec 2024 (IST)

పార్లమెంట్ ప్రవేశం వద్ద బీజేపీ మహిళ ఎంపీలను రాహుల్​ గాంధీ నెట్టివేసినట్లు జేపీ నడ్డా, కిరెన్ రిజిజు ఆరోపించారు. వాళ్లకి రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీలతో రాహుల్ ప్రవర్తించిన తీరును ఖండిస్తున్నట్లు నడ్డా తెలిపారు.

2:15 PM, 19 Dec 2024 (IST)

పార్లమెంట్​ వెలువల పలువురు ఎంపీలను రాహుల్ గాంధీ నెట్టివేశారని ఆరోపిస్తున్న ఎన్డీఏ ఎంపీలు, ఇప్పుడు ఫిర్యాదు చేసేందుకు పోలీస్​ స్టేషన్​కు వెళ్లారు.

1:08 PM, 19 Dec 2024 (IST)

గాయపడిన ఎంపీలకు ప్రధాని మోదీ ఫోన్

పార్లమెంట్​ వద్ద జరిగిన తోపులాటలో గాయపడిన ఎంపీలు సారంగి, ముకేశ్​కు ప్రధాని మోదీ ఫోన్ చేసి వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఎంపీలు సారంగి, ముకేశ్​కు ICUలో చికిత్స అందిస్తున్నట్లు ఆర్​ఎమ్​​ఎల్​​ ఆసుపత్రి వైద్యుడు అజయ్ శుక్లా వివరించారు. ఇద్దరికీ తలపై గాయాలైనట్లు చెప్పారు. ఎంపీ సారంగికి తలపై కుట్లు వేశామన్నారు. సృహకోల్పోయిన ఎంపీ ముకేశ్​ రాజ్‌పుత్ స్పృహలోకి వచ్చారని వివరించారు. ఆయనకి బీపీ ఎక్కువగా ఉందని, అందుకే పరీక్షలు చేశామని, రిపోర్ట్స్​ ఆధారంగా చికిత్స కొనసాగుతోందని డాక్టర్ శుక్లా వెల్లడించారు.

12:55 PM, 19 Dec 2024 (IST)

బీజేపీ ఎంపీలు తోసేశారు : ఖర్గే

బీజేపీ ఎంపీలు తనను తోసేసినట్లు మల్లికార్జున ఖర్గే లోక్​సభ స్పీకర్​కు తెలిపారు. బీజేపీ ఎంపీలు నెట్టడం వల్లే బ్యాలెన్స్ తప్పి మకర ద్వారం వద్ద కింద పడిపోయినట్లు పేర్కొన్నారు. మరోవైపు లోక్​సభలో రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీలు దురుసుగా ప్రవర్తించారని, ఆయనను పార్లమెంట్​లోకి రాకుండా అడ్డుకున్నారని కాంగ్రెస్ ఎంపీలు లోక్​సభ స్పీకర్​కు ఫిర్యాదు చేశారు. నాలుగు రోజుల క్రితమే ఎంపీల ప్రవేశాన్ని ఎవరూ అడ్డుకోవద్దని స్పీకర్ చెప్పారని, అయినా బీజేపీ వాళ్లు రాహుల్​ను అడ్డుకున్నారని కాంగ్రెస్ ఎంపీలు తెలిపారు.

12:39 PM, 19 Dec 2024 (IST)

మరో బీజేపీ ఎంపీకి గాయాలు

పార్లమెంట్​ వద్ద జరిగిన తోపులాటలో సారంగితో పాటు బీజేపీకి ఎంపీ ముకేశ్​ రాజ్‌పుత్ కూడా గాయపడ్డారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉందని ఆర్​ఎమ్​ఎల్ ఆసుపత్రి ICUలో చికిత్స అందిస్తున్నారని వివరించాయి. సారంగి, ముకేష్‌లను కేంద్ర మంత్రులు ప్రహ్లాద్‌ జోషి, శివరాజ్‌ సింగ్ చౌహన్​తో పాటు టీడీపీ ఎంపీ అప్పల నాయుడు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. మరోవైపు గాయపడిన ఎంపీలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు డిమాండ్ చేశారు.

12:15 PM, 19 Dec 2024 (IST)

క్షమాపణలు చెప్పాల్సిందే : ఎస్​పీ

అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ఆధారంగానే దేశం ముందుకు వెళ్తుందనే విషయాన్ని బీజేపీ అర్థం చేసుకోవాలని ఎస్​పీ ఎంపీ డింపుల్ యాదవ్ అన్నారు. ఆయనను అవమానించిన తీరు ఖండించదగినదని, దీనిపై బీజేపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

12:14 PM, 19 Dec 2024 (IST)

అంబేడ్కర్​ గురించి వ్యాఖ్యలపై అమిత్​ షా క్షమాపణలు చెప్పాలని, రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఇండియా కూటమి ఎంపీలు ర్యాలీ చేపట్టారు. పార్లమెంట్ ఆవరణలోని అంబేడ్కర్ విగ్రహం నుంచి మకరద్వారం వరకు ప్లకార్డులు పట్టుకుని జై భీమ్ అంటూ నినాదాలు చేశారు.

11:48 AM, 19 Dec 2024 (IST)

బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ను అవమానించేలా మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్ష ఇండి కూటమి ఎంపీలు నీలపు రంగు దుస్తులు, కండువాలతో ఆందోళనకు దిగారు. అంబేడ్కర్‌ ప్లకార్డులు పట్టుకుని అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక, ఇతర ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని అంబేడ్కర్ విగ్రహం వద్దకు వెళ్లి ఆందోళన నిర్వహించారు. జై భీమ్ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు, బీజేపీ నేతృత్వంలోని ఎన్​డీఏ ఎంపీలు సైతం ప్లకార్డులు పట్టుకుని అంబేడ్కర్‌ను అవమానించిన కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని నిరసన తెలిపారు. అంబేడ్కర్‌ను అవమానించడం తగదని నినాదాలు చేశారు. కాంగ్రెస్ ఎప్పుడూ అంబేడ్కర్‌ను గౌరవించలేదని ఆరోపించారు.

రాహుల్​ నెట్టారు
పోటాపోటీ ఆందోళనలు చేసే క్రమంలో పార్లమెంటు ఆవరణలో తీవ్ర గందరగోళం జరిగింది. పార్లమెంటు మకరద్వారం వద్ద గోడపైకి ఎక్కి విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. తర్వాత పార్లమెంటు లోపలికి వెళ్తుంటే తోపులాట జరిగింది. ఈ సందర్భంగా ఒడిశా బీజేపీ ఎంపీ ప్రతాప్‌ చంద్ర సారంగికి గాయమైంది. ఒక ఎంపీని రాహుల్‌గాంధీ నెట్టారని, ఆ ఎంపీ తనపై పడడం వల్ల కింద పడ్డానని సారంగి చెప్పారు. అప్పుడు మెట్ల వద్ద ఉన్న తాను కిందపడినట్లు సారంగి చెప్పారు. ఆయన తలపై గాయం కాగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే సారంగి ఆరోపణలను రాహుల్ గాంధీ తోసిపుచ్చారు. తాను పార్లమెంటు లోపలికి వెళ్తుంటే బీజేపీ ఎంపీలే తమను అడ్డుకుని నెట్టేశారని, బెదిరించారని రాహుల్ చెప్పారు. మల్లికార్జున ఖర్గేను కూడా తోసివేశారని ఆ సమయంలోనే ఈ ఘటన జరిగిందన్నారు. ఇదంతా కెమెరాల్లో నిక్షిప్తమై ఉంటుందన్నారు.

Last Updated : Dec 19, 2024, 3:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.