ETV Bharat / technology

ఎల్లుండి పనులు సరిగా ప్లాన్ చేసుకోండి - ఆ రోజున పగలు 8 గంటలే! - WINTER SOLSTICE 2024 DETAILS

- ప్రతి ఏటా ఇదే పరిస్థితి! - కారణం ఏంటో మీకు తెలుసా?

Winter Solstice 2024 Details
Winter Solstice 2024 Details (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Winter Solstice 2024 Details: సాధారణంగా ఒక రోజు అంటే.. పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు ఉంటుంది. అయితే.. కొన్ని సార్లు పగలు ఎక్కువగా ఉండటం, రాత్రుళ్లు తక్కువగా ఉండటం.. పగలు తక్కువగా ఉండి, రాత్రుళ్లు ఎక్కువగా ఉండటం జరుగుతుంది. సాధారణంగా ఇలా జరిగే ప్రక్రియను "అయానంతం"(సోల్​స్టీస్)అంటారు. తాజాగా అలాంటి రోజు ఈ ఏడాది డిసెంబర్​ 21వ తేదీన రాబోతుంది. ఈ రోజున పగటి సమయం తక్కువగా, రాత్రి సమయం చాలా ఎక్కువగా ఉంటోంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? అనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

సూర్యుడికి సుదూరంగా భూమి: సూర్యుడు మధ్యాహ్న సమయంలో ఆకాశంలో అత్యధిక లేదా అత్యల్ప స్థానానికి చేరుకున్నప్పుడు సూర్యుని చుట్టూ భూమి కక్ష్యలో ఉండే రెండు బిందువులను అయనాంతం అంటారు. దీని ఫలితంగా సంవత్సరంలో అతి పొడవైన రోజు (వేసవి కాలపు అయనాంతం), అతి తక్కువ రోజు (శీతాకాలపు అయనాంతం) వస్తుంది. ఇది ఏటా రెండుసార్లు జరిగే ఘట్టం.

ఇక పగలు సమయం తక్కువగా, రాత్రి సమయం ఎక్కువగా ఉండే పరిస్థితిని శీతాకాలం అయానంతం(వింటర్​ సోల్​స్టీస్​) అంటారు. ఇది సాధారణంగా ప్రతి సంవత్సరం డిసెంబరు 19 నుంచి 23 మధ్యలో ఏదో ఒక రోజు జరుగుతుంది. శీతాకాలపు అయనాంతం ఏర్పడే రోజున సూర్యుని నుంచి భూమికి దూరం ఎక్కువగా ఉంటుంది. అలాగే చంద్రకాంతి భూమిపై ఎక్కువ సమయం ఉంటుంది. ఇక ఈ రోజున భూమి దాని ధ్రువం వద్ద 23.4 డిగ్రీల వంపులో ఉంటుంది. ఈ సహజ మార్పు కారణంగా 2024, డిసెంబరు 21న ఈ ఏడాదిలో అత్యంత తక్కువగా పగలు 8 గంటలు, సుదీర్ఘమైన రాత్రిగా చంద్ర కాంతి 16 గంటల వరకు ఉంటుంది.

అయనాంతంపై నమ్మకాలు: శీతాకాలంలో ఏర్పడే అయనాంతంపై పలు దేశాలలోని ప్రజలు పలురకాల నమ్మకాలను పాటిస్తుంటారు. చైనాతో పాటు ఇతర తూర్పు ఆసియా దేశాలలో బౌద్ధమతంలోని యన్, యాంగ్‌ శాఖకు చెందిన ప్రజలు ఈరోజును ఐక్యత, శ్రేయస్సుకు ప్రతీకగా నమ్ముతూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉత్తర భారతదేశంలో శ్రీకృష్ణునికి నైవేద్యం సమర్పించి, గీతాపారాయణం చేస్తారు. రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో పుష్య మాస పండగను ఘనంగా జరుపుకుంటారు. సూర్యుడి ఉత్తరాయణ ప్రక్రియ శీతాకాలపు అయనాంతం నుంచి మొదలవుతుంది. అందుకే మన దేశంలో దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

తగ్గనున్న ఉష్ణోగ్రతలు: శీతాకాలపు అయనాంతం ఏర్పడే రోజు, తేదీ ఏటా మారుతూ ఉంటాయి. ఇక ఈ ఏడాది 21వ తేదీన ఈ అరుదైన ఘట్టం సంభవిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక ఈ రోజున సూర్యకిరణాలు అలస్యంగా భూమికి చేరుతాయి. ఈ కారణంగా ఉష్ణోగ్రతలలో మార్పులు సంభవించి, దేశవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది.

విశ్వం గుట్టు విప్పేందుకు అలుపెరుగని ప్రయత్నాలు- 2024 అంతరిక్ష పరిశోధనల్లో కీలక విజయాలివే!

2025లో మొదటి సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా?- ఇది ఏ రాశులపై ప్రభావం చూపిస్తుందంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.