ETV Bharat / state

ఆర్టీసీ బస్టాండ్​లో బాంబ్ - ఆఖర్లో 'పోకిరీ' రేంజ్ ట్విస్ట్ - POLICE BOMB MOCK DRILL AT ONGOLE

ఒంగోలు బస్‌ స్టాండ్‌లో బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు - విషయం తెలుసుకుని షాక్‌ అయిన ప్రయాణికులు

Police Bomb Mock Drill at Ongole
Police Bomb Mock Drill at Ongole (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Police Bomb Mock Drill at Ongole : అది ఏపీలోని ఒంగోలు బస్టాండ్‌. అక్కడ పెద్ద సంఖ్యలో ప్రయాణికులు వేచి చూస్తున్నారు. బస్సు ఎక్కేవాళ్లు ఎక్కుతున్నారు. దిగేవాళ్లు దిగుతున్నారు. స్నాక్స్‌ అమ్మేవాళ్లు అమ్ముతున్నారు. ఇలా బస్టాండ్ ఎప్పటి లాగానే చాలా రద్దీగా ఉంది. ఇంతలో ఏమైందో ఏమో కానీ పరుగు పరుగున పోలీస్ అధికారులు, సిబ్బంది అక్కడకు వచ్చారు. జాగిలాలతో తనిఖీలు చేపట్టారు. ప్రత్యేక పరికరాలతో బస్టాండ్‌లో వెతుకులాట ప్రారంభించారు. అనుమానాస్పదంగా కనిపించిన ఓ సంచిని స్వాధీనం చేసుకున్నారు. అందులో పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించి బయటకు తీశారు. దాంతో అక్కడున్న ప్రయాణికుల్లో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. బస్టాండులో ఎవరో బాంబు అమర్చారంటూ భయాందోళనకు గురయ్యారు. అనంతరం ప్రత్యేక సూట్‌ ధరించిన కొంత మంది అధికారులు అక్కడికి చేరుకున్నారు. బ్యాగ్‌ నుంచి పేలుడు పదార్థాలు అత్యంత జాగ్రత్తగా బయటకు తీసి, తీగలు కత్తిరించి పేలకుండా నిర్వీర్యం చేశారు.

మళ్లీ పాఠశాలలకు బాంబు బెదిరింపులు - వారంలో రెండోసారి - పోలీసులు హై అలెర్ట్

అసలు విషయం తెలిసి షాక్‌ : అయితే అసలు ట్విస్ట్ అంతా ఇక్కడే ఉంది. ఇదంతా శాంతి భద్రతల పరిరక్షణ, సంఘ విద్రోహ చర్యలను నిర్వీర్యం చేయడం, పౌరుల్లో భద్రతా భావాన్ని పెంపొందించే చర్యల్లో భాగంగా చేపట్టిన డెమో డ్రిల్‌ అని తెలుసుకుని ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎస్పీ ఏఆర్‌.దామోదర్‌ ఆదేశాల మేరకు ఒంగోలులోని ఆర్టీసీ డిపోలో ఈ డెమో డ్రిల్‌ చేపట్టారు. అనంతరం పోలీసు అధికారులు మాట్లాడుతూ అనుమానిత వ్యక్తులు కనిపించినా, ఏమైనా అనుమానాస్పద బ్యాగులు, ఇతర వస్తువులు కనిపించినా స్థానిక పోలీసులకు లేదా డయల్‌ 112కు కాల్‌ చేసి సమాచారం అందించాలని సూచించారు. డెమోను ఏఎస్పీ అశోక్‌ బాబు, ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాస రావు, ఏఆర్‌ డీఎస్పీ కె.శ్రీనివాస రావు, సీఐ నాగరాజు, ఎస్సై త్యాగరాజు తదితరులు పర్యవేక్షించారు.

Police Bomb Mock Drill at Ongole
తనిఖీ నిర్వహిస్తున్న దృశ్యం (ETV Bharat)

హైదరాబాద్​ ఎయిర్‌పోర్టులో 6 విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్‌ - తెర వెనక ఆ పుస్తక రచయిత!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.