Trump Administration Picks :త్వరలో అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీకా వ్యతిరేక ఉద్యమకారుడు రాబర్ట్ ఎఫ్ కెన్నడీకి ఆరోగ్య మంత్రిత్వ శాఖ కట్టబెట్టారు. ప్రజారోగ్యానికి సంబంధించి ఔషధ కంపెనీల అసత్యాలు, తప్పుడు సమాచార వ్యాప్తితో అమెరికన్లు ఎంతోకాలం నుంచి నలిగిపోతున్నారని ట్రంప్ ఎక్స్‌లో పోస్టు చేశారు. హానికర రసాయనాలు, కాలుష్యం, పురుగు మందుల నుంచి పౌరులను రక్షించడంలో ఆరోగ్య, మానవ సేవల శాఖ కీలకపాత్ర పోషిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. శాస్త్రీయ పరిశోధనల్లో ప్రమాణాలను పెంచి, ఆరోగ్య విభాగాల్లో రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్ పారదర్శకత తీసుకొస్తారని అన్నారు. దీర్ఘకాల వ్యాధులను అరికట్టి అమెరికాను మళ్లీ ఆరోగ్యకర దేశంగా జూనియర్ కెన్నడీ మార్చేస్తారని పూర్తిగా నమ్ముతున్నట్లు చెప్పారు.
అమెరికా ఆరోగ్య మంత్రిగా రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్- వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరొలినా - TRUMP ADMINISTRATION PICKS
అమెరికా అరోగ్య మంత్రిగా రాబర్ట్ ఎఫ్ కెన్నడీ- వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటీరీగా కరొలినా లీవిట్ నియామకం
Published : Nov 16, 2024, 8:52 AM IST
మాజీ అటార్నీ జనరల్ రాబర్ట్ ఎఫ్ కెన్నడీ కుమారుడైన జూనియర్ కెన్నడీ గతంలో వ్యాక్సిన్లకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ప్రచారం చేశారు. గతేడాది జరిగిన డెమొక్రటిక్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌తో అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం తలపడ్డారు. అనంతరం స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన ఆయన ట్రంప్‌నకు మద్దతు ప్రకటించి పోటీనుంచి వైదొలిగారు.
వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరొలినా లీవిట్
వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరొలినా లీవిట్ నియమించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కరొలినా చాలా తెలివైనది, కఠినమైనది, అత్యంత ప్రభావవంతమైన కమ్యూనికేటర్ అని ట్రంప్ ఆమెను ప్రశంసించారు. తనకు కరొలినాపై నమ్మకం ఉందని, ఆమె తమ సందేశాలను ప్రజలకు చేరవేస్తుంది అని ట్రంప్ చెప్పారు. ట్రంప్ ప్రచారానికి నేషనల్ ప్రెస్ సెక్రటరీగా కరొలినా పనిచేశారు. అంతకుముందు ట్రంప్ 1.0 హయాంలో వైట్‌హౌస్ అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా పనిచేశారు.