తెలంగాణ

telangana

ETV Bharat / international

పాక్​లో ప్రయాణికుల వాహనాలపై ఉగ్రవాదుల కాల్పులు- 50 మంది మృతి - PAKISTAN MILITANT ATTACK

పాకిస్థాన్​లో ప్రయాణికుల వాహనాలపై ఉగ్రవాదుల కాల్పులు- అనేక మంది మృతి

Pakistan Militant Attack
Pakistan Militant Attack (ANI)

By ETV Bharat Telugu Team

Published : Nov 21, 2024, 6:34 PM IST

Pakistan Militant Attack On Vehicles :పాకిస్థాన్‌లో ప్రయాణికుల వాహనాలపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 50 మంది మరణించారు. 20 మంది గాయపడ్డారు. ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్​లోని కుర్రం జిల్లాలో గురువారం ఈ ఘటన జరిగింది. బాధితుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారు.

కుర్రం జిల్లాలో కొన్ని కారణాల వల్ల ఓ కీలక రహదారిని కొన్ని వారాలపాటు మూసివేయగా, దానిని ఇటీవల తెరిచారు. ఈ మార్గంలోనే పరాచినార్‌ నుంచి పెషావర్‌కు ప్రయాణికులతో వెళ్తున్న వాహనాలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో బాధితుల సంఖ్య మరింత పెరగవచ్చని ప్రావిన్స్ చీఫ్‌ సెక్రటరీ నదీమ్‌ అస్లాం చౌధ్రీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details