Fire Accident at Turkey:తుర్కియేలోని బోలు ప్రావిన్స్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 76 మంది మృతిచెందగా, అనేక మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తుర్కియే వైద్యారోగ్య శాఖ మంత్రి తెలిపారు. మరో ఇద్దరు భవనంపై నుంచి దూకి మృతిచెందారని వెల్లడించారు.
హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- 76 మంది మృతి - FIRE ACCIDENT AT TURKEY
తుర్కియేలోని ఓ రిసార్ట్‌లోని హోటల్‌లో అగ్నిప్రమాదం- అనేక మంది మృతి
![హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- 76 మంది మృతి Fire Accident at Turkey](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/21-01-2025/1200-675-23372224-thumbnail-16x9-fire.jpg)
Published : Jan 21, 2025, 6:06 PM IST
|Updated : Jan 22, 2025, 6:59 AM IST
తుర్కియే కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున మూడున్నర గంటలకు కర్టల్‌కాయ రిసార్ట్‌లోని 12 అంతస్తుల హోటల్‌లో ఈ అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకొని మంటలను అదుపుచేశారు. ఘటన స్థలికి 30 అగ్నిమాపక వాహనాలు, 28 అంబులెన్సులు వచ్చినట్లు తుర్కియే మీడియా పేర్కొంది.ప్రమాదం జరిగిన సమయంలో హోటల్‌లో 234 మంది అతిథులు బస చేసినట్లు తెలిపింది. హోటల్‌కు చెందిన ఒక ఉద్యోగి దాదాపు 20 మందిని కాపాడారని వెల్లడించింది. కొంత మంది గదుల్లో నుంచి దుప్పట్ల సాయంతో కిందకు దిగేందుకు ప్రయత్నించారని స్థానికులు చెప్పారు.
ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని బోలు ప్రావిన్స్ గవర్నర్ చెప్పారు. అందుకోసం ఆరుగురు ప్రాసిక్యూటర్లను నియమించినట్లు పేర్కొన్నారు. మరోవైపు రిస్టార్లోని మిగిలిన అతిథులను ముందు జాగ్రత్త చర్యగా ఖాళీ చేయించి, చుట్టుపక్కల హోటళ్లకు పంపించారని తెలిపారు.