Israel Fresh Attack On Gaza :ఉత్తర గాజాలోని శరణార్థుల శిబిరంపై ఆదివారం ఇజ్రాయెల్ చేసిన దాడిలో 17మంది చనిపోయారని పాలస్తీనా ఆస్పత్రి అధికారు ఒకరు తెలిపారు. మృతుల్లో 9మంది మహిళలు ఉన్నట్లు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు. అయితే ఈ ఘటనపై ఇజ్రాయెల్ స్పందించలేదు.
గాజా, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి!- 37మంది మృతి - ISRAEL FRESH ATTACK ON GAZA
ఉత్తర గాజాలోని శరణార్థుల శిబిరంపై దాడి చేసిన ఇజ్రాయెల్!- 17మంది మృతి
Published : Nov 10, 2024, 2:59 PM IST
గత నెల రోజులుగా జబాలియా, దాని పరిసర టౌన్లు అయిన బీయిట్ లాహియా, బీయిట్ హనోన్ను ఇజ్రాయెల్ సైన్యం చుట్టుముట్టింది. మానవతా సయాహాన్ని మాత్రమే అనుమతించింది. దీంతో వేలాది మది ప్రజలు దగ్గరలోని గాజా నగరానికి పారిపోయారు.
లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడి- 20మంది మృతి
ఇదిలా ఉండగా, ఉత్తర లెబనాన్‌పై ఆదివారం ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో 20మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. బీరుట్కు ఉత్తర దిక్కుగా ఉన్న అలామత్ అనే గ్రామంలో ఈ దాడి జరిగింది. హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్ ప్రాబల్యం ఉన్న లెబనాన్‌లోని దక్షిణ, తూర్పు భాగాలకు ఈ ప్రాంతం దూరంగా ఉండటం గమనార్హం.