ETV Bharat / international

ఎముకలు కొరికే చలి- ఇండోర్​లోనే ట్రంప్ ప్రమాణస్వీకారం- నెవ్వర్ బిఫోర్​ అనేలా ఏర్పాట్లు! - DONALD TRUMP INAUGURATION

20న రోటుండాలో ట్రంప్ ప్రమాణస్వీకారం - కనీవినీ ఎరుగని స్థాయిలో భద్రతా ఏర్పాట్లు!

Donald Trump
Donald Trump (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 18, 2025, 10:52 AM IST

Updated : Jan 18, 2025, 12:21 PM IST

Donald Trump Inauguration : అమెరికా 47వ దేశాధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (78) జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం వాషింగ్టన్‌ నగరంలోని క్యాపిటల్ భవనంలో ఉన్న గోళాకార సముదాయం(రోటుండా)ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం వాషింగ్టన్‌లో ఎముకలు కొరికే చలి ఉన్నందున, రోటుండా సముదాయం లోపల వెచ్చటి వాతావరణంలో ట్రంప్ ప్రమాణ స్వీకారాన్ని నిర్వహిస్తున్నారు. సాధారణంగానైతే అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని క్యాపిటల్ భవనం పశ్చిమ భాగంలో నేషనల్ మాల్, జాతీయ చిహ్నాల ఎదుట నిర్వహించేవారు. వేలాది మంది ప్రజానీకం సాక్షిగా ఈ ఘట్టం జరిగేది.

ఈ సారి చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో క్యాపిటల్ భవనం లోపల ఉండే రోటుండా సముదాయంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయినా చలిని లెక్క చేయకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది ట్రంప్ మద్దతుదారులు వాషింగ్టన్‌‌‌‌కు చేరుకుంటున్నారు. భారీ ధరను చెల్లించి మరీ నగరంలోని హోటళ్లలో బస చేస్తున్నారు. ఇదే అదనుగా హోటళ్ల నిర్వాహకులు సాధారణం కంటే మూడు, నాలుగు రెట్లు ఎక్కువగా రూమ్‌ అద్దెలను వసూలు చేస్తున్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం జరగనున్న సోమవారం రోజున వాషింగ్టన్ డీసీలో ఉష్ణోగ్రతలు సగటున మైనస్ 11 డిగ్రీల సెల్సీయస్ మేర ఉంటాయని వాతావరణ అంచనాలు వెలువడుతున్నాయి.

Trump inauguration moving indoors
ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు (Associated Press)

ట్రంప్ చేసిన ప్రకటన ఇదీ!
తన ప్రమాణ స్వీకార వేదికను క్యాపిటల్ భవనంలోని రోటుండా సముదాయంలోకి మార్చారని తెలుపుతూ డొనాల్డ్ ట్రంప్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆర్కిటిక్ ప్రాంతం వైపు నుంచి వాషింగ్టన్ దిశగా బలమైన చలిగాలులు వీస్తున్నాయని ఆయన తెలిపారు. "వాతావరణం బాగా లేదు. ఈ నెల 20న నా ప్రమాణ స్వీకారం వేళ వేలాది మంది అనుచరులు, భద్రతా సిబ్బంది, పోలీసులు ఇబ్బంది పడాలని నేను కోరుకోవడం లేదు" అని ట్రంప్ పేర్కొన్నారు. చివరిసారిగా 1985 జనవరి 20న అమెరికాలో దేశాధ్యక్షుడి ప్రమాణ స్వీకారం ఈ విధంగా రోటుండా సముదాయంలో జరిగింది. అప్పట్లో మైనస్ 14 డిగ్రీలసెల్సీయస్ ఉష్ణోగ్రత నమోదైంది.

Trump inauguration moving indoors
ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవ వేదికను సిద్ధం చేస్తున్న సిబ్బంది (Associated Press)

కనీవినీ ఎరుగని స్థాయిలో భద్రతా ఏర్పాట్లు
ట్రంప్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో వాషింగ్టన్‌లో కనీవినీ ఎరుగని స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. నగరంలో దాదాపు 30 మైళ్ల పరిధిలో తాత్కాలిక కంచెను ఏర్పాటు చేశారు. దాదాపు 25వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. చాలా అంచెల భద్రతా వలయాన్ని దాటితే కాని వాషింగ్టన్‌లోని క్యాపిటల్ భవనాన్ని ఎవరూ చేరుకోలేరు. ప్రత్యేక అతిథులు, ఆహ్వానితులను మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ఈ తరుణంలో అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కూడా తమ పనిని మొదలుపెట్టారు. ఈ కార్యక్రమానికి అంతరాయం కలిగించే చర్యలను, నిరసనలను ముందస్తుగా గుర్తించే పనిలో పడ్డారు.

Trump inauguration moving indoors
ట్రంప్ ప్రమాణ స్వీకార వేదికను పరిశీలిస్తున్న అధికారులు (Associated Press)

'క్యాపిటల్ భవనం'లో నిరసన తెలిపిన వారికీ అనుమతి
2020లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయారు. అప్పట్లో చాలా మంది ఆయన మద్దతుదారులు వాషింగ్టన్‌లోని క్యాపిటల్ భవనంలోకి చొరబడ్డారు. నిరసనకు దిగారు. దీంతో వారిపై కేసులు నమోదయ్యాయి. కట్ చేస్తే, ఇప్పుడు ట్రంప్ మరోసారి అధ్యక్షుడిగా ప్రమాణం చేయబోతున్నారు. నాడు క్యాపిటల్ భవనంలో నిరసనకు దిగిన ట్రంప్ అభిమానుల్లో పలువురిని ఈసారి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు. ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వారికి కోర్టు నుంచి అనుమతులు మంజూరయ్యాయి.

జిన్‌పింగ్‌కు ట్రంప్‌ ఫోన్‌ - వాణిజ్యం సహా కీలక సమస్యల పరిష్కారంపై చర్చ!

డొనాల్డ్ ట్రంప్‌ 'హష్‌ మనీ' కేసు- న్యాయస్థానం కీలక తీర్పు

Last Updated : Jan 18, 2025, 12:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.