ETV Bharat / international

ఇజ్రాయెల్, హమాస్​ సీజ్ ఫైర్ డీల్​కు కేబినెట్ ఓకే- ఆదివారం నుంచే అమలు - ISRAEL HAMAS CEASEFIRE DEAL

కాల్పుల విరమణ, బందీల విడుదల ఒప్పందానికి ఇజ్రాయెల్‌ కేబినెట్‌ ఆమోదం

Israel Hamas Ceasefire Deal
Israel Hamas Ceasefire Deal (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 18, 2025, 7:16 AM IST

Israel Hamas Ceasefire Deal : ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఆదివారం నుంచి అమల్లోకి రానుంది. ఆదివారం పలువురు బందీలను హమాస్ విడుదల చేయనుంది. ఇందుకు బదులుగా వందలాది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టనుంది. అందుకోసం ఓ జాబితాను కూడా ఇజ్రాయెల్ ప్రచురించింది. ఇందులో హమాస్ అత్యంత కీలకంగా భావించే మార్వాన్ బర్ఘౌటి పేరు ఉందా లేదా అనేది తెలియాల్సి ఉంది. భవిష్యత్తులో పాలస్తీనాకు బర్ఘౌటి అధ్యక్షుడవుతారనే ప్రచారం ఉండటం వల్ల ఇజ్రాయెల్ ఏ నిర్ణయం తీసుకుని ఉంటుందనేది ఆసక్తిగా మారింది.

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కాల్పుల విరమణ, బందీల విడుదల ఒప్పందానికి ఇజ్రాయెల్‌ కేబినెట్‌ శనివారం ఆమోదం తెలిపింది. అమెరికా, ఈజిప్టు, ఖతార్‌ మధ్యవర్తిత్వంతో బుధవారం కుదిరిన ఈ ఒప్పందానికి శనివారం ఆమోదం తెలిపింది. దీంతో 15 నెలలుగా సాగిన యుద్ధం ముగియనుంది. హమాస్ ,ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ 24 గంటల్లోపు అమల్లోకి వస్తుందని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎక్స్‌లో పేర్కొంది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందని చెప్పింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అధికారుల ఆదేశాల కోసం వేచి ఉండాలని సూచించింది.

ఎంతమంది ప్రాణాలతో ఉన్నారు?
ఒప్పందంలో భాగంగా వచ్చే ఆరు వారాల వ్యవధిలో 33 మంది ఇజ్రాయెలీ బందీలను హమాస్ విడుదల చేయనుంది. దీనికి బదులుగా ఇజ్రాయెల్ జైలులో ఖైదీలుగా ఉన్న వందలాది పాలస్తీనా పౌరులను నెతన్యాహు ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇజ్రాయెల్-హమాస్‌ కాల్పుల విరమణ ఒప్పందంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హమాస్ అదుపులో ఉన్న బందీలలో ఎంతమంది ప్రాణాలతో ఉన్నారనేది ప్రశ్నార్థకం. ఇక విడుదల చేయబోయే బందీలు ఎవరు, వారి పేర్లు ఎంటనేవి తెలియాల్సి ఉంది. అయితే ఒప్పందంలో భాగంగా తొలిరోజు ముగ్గురు మహిళలను విడిచిపెడతామని హమాస్ చెబుతోంది. ఏడో రోజు నలుగురిని, మిగిలిన 26 మందిని తర్వాతి ఐదు వారాల్లో విడిచిపెడతామని పేర్కొంది.

700 మంది విడుదల
మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందం మొదటి విడతలో భాగంగా విడుదల కానున్న 700 మందికి పైగా వ్యక్తుల జాబితాను ఇజ్రాయెల్ న్యాయ మంత్రిత్వ శాఖ ప్రచురించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదించిన కొన్ని గంటల తర్వాత ఈ జాబితాను ప్రకటించింది. ఆదివారం స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల కంటే ముందు పాలస్తీనా ఖైదీల విడుదల ప్రారంభం కాదని ఇజ్రాయెల్ తెలిపింది. ఈ జాబితాలో హమాస్‌, ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్ సభ్యులు, తీవ్రమైన నేరాల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న కొందరు వ్యక్తులు ఉన్నట్టు పేర్కొంది.

బందీల జాబితాలో బర్ఘౌటీ!
ఇజ్రాయెల్ విడుదల చేయనున్న ఖైదీల జాబితాలో కీలకమైన 64 ఏళ్ల మార్వాన్ బర్ఘౌటి పేరు ఉందా లేదా అనేది తెలియాల్సి ఉంది. పాలస్తీనియన్లు బర్ఘౌటీని భవిష్యత్తులో అధ్యక్ష రేసులో ఉండే ప్రధాన అభ్యర్థిగా భావిస్తారని ప్రచారం ఉంది. దీనిపై ఇజ్రాయెల్ ఏ నిర్ణయం తీసుకుందనేది ఆసక్తిగా మారింది. 2000 ప్రారంభంలో రెండో పాలస్తీనా తిరుగుబాటు సమయంలో బర్ఘౌటి వెస్ట్ బ్యాంక్‌లో నాయకుడిగా ఉన్నారు. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ అతన్ని విడుదల చేయాలని హమాస్ డిమాండ్ చేసింది.

2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లోకి చొచ్చుకొచ్చిన హమాస్ మిలిటెంట్లు 1200 మందిని చంపారు. 250 మందిని బందీలుగా తీసుకెళ్లారు. వీరిలో గతంలో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం సమయంలో పలువురిని హమాస్ విడుదల చేసింది. వివిధ ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా హమాస్ అదుపులో 100 మంది వరకు ఉండొచ్చని తెలుస్తోంది. హమాస్ దాడులకు ప్రతిగా 15 నెలలుగా గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్ దాడుల్లో 46 వేల మందికిపైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.