తెలంగాణ

telangana

ETV Bharat / international

పెట్రోల్​ ట్యాంకర్​ పేలి 70మంది మృతి- అక్కడే పొరపాటు జరిగింది! - NIGERIA TANKER TRUCK EXPLOSION

సెంట్రల్‌ నైజీరియాలో ఘోర ప్రమాదం - పెట్రోల్‌ ట్యాంకర్‌ పేలి దాదాపు 70 మంది మృత్యువాత

Nigeria Tanker Truck Explosion
Nigeria Tanker Truck Explosion (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Jan 19, 2025, 7:58 AM IST

Nigeria Tanker Truck Explosion :సెంట్రల్‌ నైజీరియాలో ఓ పెట్రోల్‌ ట్యాంకర్‌ పేలి దాదాపు 70మంది ప్రాణాలు కోల్పోయారు. నైజర్‌ రాష్ట్రంలోని సులేజా ప్రాంతంలో కొంతమంది జనరేటర్‌ ఉపయోగించి ఓ ట్యాంకర్‌ నుంచి మరో ట్యాంకర్‌లోకి పెట్రోల్‌ పంపు చేస్తున్న క్రమంలో ఈ పేలుడు జరిగింది. పెట్రోల్‌ను పంపు చేస్తున్న సిబ్బందితో పాటు చుట్టుపక్కన పదుల మీటర్ల దూరంలో ఉన్నవారు కూడా మరణించినట్లు నైజీరియా అత్యవసర ప్రతిస్పందన ఏజెన్సీ వెల్లడించింది. సహాయక చర్యలు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది.

ఆఫ్రికా ఖండంలోనే అత్యంత జనాభా కలిగిన నైజీరియాలో సరుకు రవాణాకు సమర్థవంతమైన రైల్వే వ్యవస్థ లేకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయి. గతేడాది సెప్టెంబర్​లో నైజర్ రాష్ట్రంలో పెట్రోల్​ ట్యాంకర్​, ట్రక్కు ఢీకొనడం వల్ల దాదాపు 48మంది మృతిచెందారు. నైజీరియా ఫెడరల్ రోడ్ సేఫ్టీ లెక్కల ప్రకారం, 2020లో 1531 పెట్రోల్ ట్యాంకర్ ప్రమాదాలు సంభవించాయి. ఈ ప్రమాదాల్లో 535 మంది మరణించారు, 1142 మంది గాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details