తెలంగాణ

telangana

ETV Bharat / international

'బైడెన్ వద్దు- ఒబామా భార్య అయితే ఓకే'- డెమొక్రాట్ల అభ్యర్థిగా మిషెల్​కు జై! - అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024

Michelle Obama America Elections : రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠం కోసం పోటీపడుతున్న జో బైడెన్​కు షాక్ తగిలింది. అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ మళ్లీ పోటీలో దిగడాన్ని మెజార్టీ అమెరికన్లు ఇష్టపడటం లేదని ఓ సర్వేలో తేలింది. ఆయనకు బదులుగా డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా మిషెల్ ఒబామా ఉంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తమైంది. మరోవైపు అధ్యక్ష ఎన్నికల రేసులో బైడెన్, డొనాల్డ్ ట్రంప్​ ముందంజలో ఉన్నారు.

Michelle Obama America Elections
Michelle Obama America Elections

By ETV Bharat Telugu Team

Published : Feb 28, 2024, 12:30 PM IST

Michelle Obama America Elections : అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వాన్ని దక్కించుకునేందుకు డెమొక్రటిక్‌, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థులు జో బైడెన్‌, డొనాల్డ్ ట్రంప్‌ హోరాహోరీగా తలపడుతున్నారు. ఇప్పటికే డెమొక్రటిక్ పార్టీ తరపున జో బైడెన్, రిపబ్లికన్ పార్టీలో ట్రంప్ ముందంజలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అధికార డెమొక్రటిక్‌ పార్టీలో ఆసక్తికర పరిమాణం సంభవించింది. డెమొక్రటిక్ పార్టీ తరపున అధ్యక్షుడు బరిలో బైడెన్ బదులు ఎవరిని ఎన్నుకుంటారనే అనే ప్రశ్నకు ఆ పార్టీ మద్దతుదారులు అనూహ్య సమాధానమిచ్చారు. బైడెన్‌ బదులుగా అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా భార్య మిషెల్ ఒబామా బరిలో నిలవాలని అమెరికన్లు కోరుకుంటున్నారని రాస్‌ముస్సేన్‌ రిపోర్ట్స్‌ పోల్‌ పేర్కొంది.

వ్యతిరేకంగా 48 శాతం మంది
జో బైడెన్ 2024లో జరిగే ఎన్నికల్లో మళ్లీ నిలబడేందుకు అమెరికన్లు ఇష్టపడటం లేదుని రాస్​ముస్సేన్ సర్వే తెలిపింది. బైడెన్ వయసు, మానసిక ఆరోగ్య స్థితి దృష్ట్యా ఆయనను 48 శాతం మంది వ్యతిరేకిస్తున్నారని పేర్కొంది. 38 శాతం మంది బైడెన్ మళ్లీ పోటీ చేసేందుకు సమ్మతిస్తున్నట్లు వెల్లడించింది. బైడెన్‌ బదులుగా మాజీ అధ్యక్షుడు ఒబామా భార్య మిషెల్ ఒబామా, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌, కాలిఫోర్నియా గవర్నర్ గావిన్‌ న్యూసోమ్‌, మిషిగన్ గవర్నర్ గ్రెచెన్ విట్మర్ పేర్లను ఉంచారు. వీరిలో అత్యధికంగా 20 శాతం మంది మిషెల్ అభ్యర్థిత్వానికి మద్దతు పలికారు. 15 శాతం కమలా హారిస్, 12 శాతం హిల్లరీ క్లింటన్​కు మద్దతుగా నిలిచారు.

మిషిగన్ ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్, బైడెన్ గెలుపు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ వరుస విజయాలు సాధిస్తున్నారు. ఇప్పటికే నాలుగు ప్రైమరీ ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ తాజాగా మిషిగన్ ప్రైమరీలో ఘన విజయం సాధించారు. మంగళవారం జరిగిన మిషిగన్ ఎన్నికల్లో ట్రంప్ 66.4 శాతం ఓట్లు సాధించి ప్రత్యర్థి నిక్కి హేలీపై భారీ మెజారిటీతో గెలుపొందారు. మరోవైపు అదే రాష్ట్రంలో డెమెక్రటిక్ నేత జో బైడెన్​ కూడా గెలుపొందారు.

ట్రంప్​పై బైడెన్ విమర్శలు
కాగా, అధ్యక్షుడి వయసుపై వ్యక్తమవుతున్న ఆందోళనలను బైడెన్ తోసిపుచ్చారు. తన ప్రధాన పోటీదారు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్​ది కూడా దాదాపు తన వయసేనని పేర్కొన్నారు. ట్రంప్ కనీసం తన భార్య పేరును కూడా గుర్తుంచుకోలేరని ఎద్దేవా చేశారు.

ఎన్నికల రేసులో దూసుకెళ్తున్న ట్రంప్‌- నిక్కీ హేలీకి షాక్​- సొంత రాష్ట్రంలోనే చుక్కెదురు!

ఉపాధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో వివేక్​కు గట్టి పోటీ- ఆమెపై పైచేయి సాధించేనా?

ABOUT THE AUTHOR

...view details