Mysterious Drones In US :అమెరికాలోని ఆకాశంలో ప్రకాశవంతమైన వస్తువులు కలకలం సృష్టిస్తున్నాయి. న్యూజెర్సీలో రాత్రి వేళ ఆకాశంలో అనుమానాస్పదంగా వస్తువులు కనిపించాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురైనట్లు అక్కడి మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వాటని కూల్చేయలంటూ అమెరికాకు ఎన్నికైన అధ్యక్షుడు స్పందించారు.
ఇటీవల యూఎఫ్‌వో (UFO) తరహా డ్రోన్‌లు ఆకాశంలో ఎగిరాయి. మళ్లీ గురువారం రాత్రి ఆకాశంలో అనుమానాస్పద వస్తువులు ఎగరడం కనిపించింది. దీంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరోవైపు ఈ డ్రోన్‌లు ఇరాన్ మదర్‌షిప్ నుంచే వచ్చాయని కొందరు, వాటిని చైనా వదిలిందని మరికొందరు, ట్రంప్ చేయించారంటూ సామాజిక మాధ్యమాల్లో వందతులు వినిపిస్తున్నాయి. ఈక్రమంలో అధ్యక్షుడు జో బైడెన్ దీనిపై సమాధానం చెప్పాలని స్థానిక గవర్నర్ ఫిల్ మర్ఫీ డిమాండ్ చేశారు.