World Oldest Woman Death : ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా పేరొందిన టోమికో ఇతోకా కన్నుమూశారు. జపాన్‌కు చెందిన 116 ఏళ్ల టొమికో వృద్ధాప్య సమస్యల కారణంగా ఆమె ఇంట్లో డిసెంబరు 29న మృతి చెందినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.
టోమికో ఇతోకా 1908లో మే 23న ఒసాకోలో జన్మించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, గత ఏడాది స్పెయిన్ దేశస్థురాలైన బ్రన్యాస్ (117) మృతి చెందడం వల్ల అత్యంత వృద్ధ మహిళగా ఇతోకా పేరొందారు. గతేడాది మేలో ఇతోకా జన్మదిన వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించారు. స్థానికంగా ఉన్న పలువురు ప్రముఖులు ఆమెను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు.
టోమికో ఇతోకాకు అరటిపళ్లన్నా, అక్కడ దొరికే 'కాల్పిస్' అనే ప్రత్యేక డ్రింక్‌ను ఎక్కువగా తీసుకునేవారు. పాఠశాల విద్యార్థినిగా ఉన్నప్పుడు వాలీబాల్ ఆడేవారు. జపాన్‌లోని మౌంట్ ఒంటాకేను రెండు సార్లు అధిరోహించారని పేర్కొన్నారు. సుమారు 3,067 మీటర్ల ఎత్తయిన ఆన్‌టేక్ శిఖరాన్ని ఆమె రెండు సార్లు అధిరోహించి రికార్డు సాధించారు. 20 ఏళ్లకే టోమికో వివాహం చేసుకున్నారు. ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. 1979లో తన భర్త చనిపోయినప్పటి నుంచీ 'నర' నగరంలో ఒంటరిగానే జీవనం సాగించారు. జెరొంటాలజీ రీసెర్చ్ గ్రూప్ వెల్లడించిన వివరాల ప్రకారం ఇతోకా మరణంతో ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వృద్ధమహిళగా 116 ఏళ్ల నన్ కెనబర్రో లుకాస్ నిలిచారు. బ్రెజిల్‌కు చెందిన ఆమె ఇతోకా కంటే 16 రోజులు చిన్నవారు.
ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడి మృతి
ఇటీవల ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు జాన్ ఆల్‌ఫ్రెడ్ టిన్నిస్‌వుడ్ మృతి చెందారు. 2024 ఆగస్టు 26న తన 112వ పుట్టినరోజు జరుపుకున్న జాన్ ఆల్‌ఫ్రెడ్ గిన్నిస్ రికార్డుల ప్రకారం దాదాపు తొమ్మిది నెలలపాటు ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడి హోదాలో ఉన్నారు. ఇంగ్లాండ్ సౌత్‌పోర్టులోని ఓ సంరక్షణ కేంద్రంలో ఉంటున్న ఆయనకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ బృందం గతేడాది ఏప్రిల్‌లోనే సర్టిఫికెట్ అందజేసింది. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ఆర్మీలో సేవలందించారు. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.