Women Should Include 5 Vitamins in Their Diet: మహిళల రోజువారీ ఆరోగ్యంలో విటమిన్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. 2023 నాటి UNICEF నివేదిక ప్రకారం.. ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది బాలికలు, మహిళలు.. రక్తహీనత, పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. అయితే.. ఇవే కాకుండా హార్మోన్ల మార్పులు, రుతుక్రమం, పునరుత్పత్తి సవాళ్ల మధ్య సముచితంగా పనిచేయడానికి వారికి తగినన్ని విటమిన్లు అవసరం. అయితే చాలా మంది మహిళలు విటమిన్స్ అనగానే సంప్లిమెంట్స్ రూపంలో తీసుకుంటారు. అలాకాకుండా శరీరానికి కావాల్సిన విటమిన్లను ఆహారాల నుంచే పొందాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి మహిళలకు అత్యంత ముఖ్యమైన విటమిన్లు ఏంటి? అవి ఏ ఆహార పదార్థాల్లో లభిస్తాయి? అన్నది ఈ స్టోరీలో చూద్దాం..
అలర్ట్ : మహిళలు, పురుషుల్లో వేర్వేరుగా - గుండెపోటు లక్షణాలు!
విటమిన్ A: విటమిన్ ఏ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కొన్ని పరిశోధనల ప్రకారం.. విటమిన్ A ఎముకలు, దంతాలను స్ట్రాంగ్ గా ఉంచడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా పునరుత్పత్తి ఆరోగ్యానికి ఈ విటమిన్ కీలకమైనది. అంతేకాకుండా ఈ విటమిన్‌ను రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులను నివారించుకోవచ్చు.
ఫుడ్స్: టమాటలు, క్యారెట్, వాటర్ మెలోన్, జామపండ్లు, బ్రొకోలీ, కాలే, బొప్పాయి, పీచ్, గుమ్మడికాయ, పాలకూర, చేపలు, పాలు, గుడ్లు వంటివి రెగ్యులర్‌గా డైట్లో చేర్చుకోవాలి.
విటమిన్ B3: బి విటమిన్లు మహిళలకు ముఖ్యమైనవి. కణాల అభివృద్ధికి, పనితీరుకు విటమిన్ B3 చాలా ముఖ్యమైనది. పోషకాలను శక్తిగా మార్చడం, DNA, నాడీవ్యవస్థ పనితీరు సహా అనేక శారీరక విధులకు అవసరం.
ఫుడ్స్: ట్యూనా చేపలు, పల్లీలు, పుట్టగొడుగులు, గోధుమలు, పాలు, గుడ్లు, బీన్స్ వంటివి తీసుకోవాలి.
విటమిన్ B6: ఈ విటమిన్ శరీరంలో హార్మోనుల ఉత్పత్తికి.. బ్రెయిన్ కెమికల్స్ విడుదల చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే రక్తహీనతను నివారించడంలో, PMS లక్షణాలను తగ్గించడంలో సాయపడుతుంది.
ఫుడ్స్: బీన్స్, నట్స్, కోడి గుడ్లు, ముడి పదార్థాలు, ఫోర్టిఫైడ్ సెరెల్స్, అవొకాడో, అరటిపండ్లు, మాంసాహారం, ఓట్ మీల్, డ్రైఫ్రూట్స్‌లో అధికంగా ఉంటుంది.
విటమిన్ B9:విటమిన్ బి9ను ఫోలిక్ యాసిడ్ అని కూడా పిలుస్తారు. ఇది మహిళలందరికీ ముఖ్యమైన విటమిన్. ముఖ్యంగా గర్భిణులకు న్యూరల్ ట్యూబ్ లోపాలను నివారించడానికి, శిశువు వెన్నెముక, మెదడును రక్షించడానికి ఉపయోగపడుతుంది. అలాగే బ్లడ్ ప్రెజర్, డిప్రెషన్, క్యాన్సర్, మెమరీ లాస్ వంటి వ్యాధులను కూడా నివారిస్తుంది.
ఫుడ్స్:ఆకుకూరలు, బీన్స్, పప్పుధాన్యాలు, గుడ్లు, నారింజ, అరటిపండ్లు, పాలఉత్పత్తులు, మాంసం, చేపలు వంటివి తీసుకోవాలి.