తెలంగాణ

telangana

ETV Bharat / health

అలర్ట్​: రాత్రంతా Wi-Fi రూటర్​ ఆన్​లో ఉంచుతున్నారా? - ఏం జరుగుతుందో తెలుసా? - Wi Fi Router Side Effects - WI FI ROUTER SIDE EFFECTS

Wi-Fi Router: నేటి డిజిటల్​ యుగంలో ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగింది. మరీ ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్లు, స్మార్ట్‌ టీవీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి ఇంటికీ ఓ నెట్​ కనెక్షన్​ ఉంది. అయితే రూటర్‌ను ఉపయోగించే క్రమంలో చాలా మంది రాత్రంతా దాన్ని ఆన్​లో ఉంచుతారు. కానీ.. ఇలా చేయడం కొన్ని సమస్యలకు కారణమవుతుందని నిపుణులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Wi-Fi Router
Wi-Fi Router (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 12, 2024, 2:43 PM IST

Wi-Fi Router Side Effects: వైఫై రూటర్‌ను ఉపయోగించే క్రమంలో చాలా మంది తెలిసో, తెలియకో కొన్ని తప్పులు చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. అలాంటి వాటిలో రాత్రంతా రూటర్‌ను ఆన్‌లో ఉంచడం ఒకటని అంటున్నారు. ఇలా చేయడం వల్ల ఎన్నో రకాల సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మరి, ఆ నష్టాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

సాధారణంగా వైఫై రూటర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్‌ను విడుదల చేస్తుంది. ఈ క్రమంలో రాత్రంతా వైఫై రూటర్‌ ఆన్‌లోనే ఉండటం కొన్ని రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అవేటంటే..

బ్రెయిన్​పై ఎఫెక్ట్​: పడుకునే ప్రదేశానికి దగ్గర్లో రూటర్‌ ఉంటే బ్రెయిన్‌పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి, అలసట, మైగ్రేన్​ వంటి సమస్యలకు కూడా ఇది కారణమవుతుందని సూచిస్తున్నారు. అందుకే.. పడుకునే సమయంలో కచ్చితంగా వైఫై రూటర్‌ను ఆఫ్‌ చేయాలని చెబుతున్నారు.

"జర్నల్ ఆఫ్ ఎపిడెమియాలజీ"లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. రాత్రంతా రూటర్​లో ఆన్​లో ఉంచడం వల్ల దగ్గర్లో పడుకునే వారికి మైగ్రేన్​ వచ్చే అవకాశం 40శాతం అధికమని కనుగొన్నారు. ఈ పరిశోధనలో ఇటలీలోని ట్యూరిన్ విశ్వవిద్యాలయంలో ఎపిడెమియాలజీ ప్రొఫెసర్ డాక్టర్​ మార్కో డి పోర్టియో పాల్గొన్నారు.

ఇంట్రస్టింగ్ : మీరు నడిచే విధానమే మీ క్యారెక్టర్​ చెప్పేస్తుంది - మరి, మీరు ఏ టైపో చెక్ చేసుకోండి! - WALKING STYLE REFLECTS PERSONALITY

అల్జీమర్స్​: రూటర్​ను రాత్రంతా ఆన్​లో ఉంచడం వల్ల క్యాన్సర్, న్యూరోలాజికల్ సమస్యలు, పునరుత్పత్తి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు. అలాగే అల్జీమర్స్ సమస్య కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.

ఈ టిప్స్​ పాటిస్తే సేఫ్​:కేవలం అనారోగ్య సమస్యలే కాకుండా రాత్రంతా వైఫై ఆన్‌లో ఉంచడం వల్ల టెక్నికల్‌గా కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.

  • ముఖ్యంగా ఇంటర్నెట్ అవసరం లేకపోయినా రూటర్‌ ఆన్‌లో ఉండడం వల్ల అనవసరంగా కరెంట్‌ వినియోగం పెరుగుతుందని.. అలాగే కొన్ని సందర్భాల్లో మీ ప్రమేయం లేకుండానే రూటర్‌ని హ్యాక్‌ చేసే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. కాబట్టి అవసరం లేని సమయంలో రూటర్‌ను ఆఫ్‌ చేయడం మంచిదంటున్నారు.
  • వైఫై రూటర్‌ని గదికి కాస్త దూరంగా ఉంటే మంచిదని సూచిస్తున్నారు
  • రేడియేషన్ ప్రభావానికి కాస్త దూరంగా ఉండాలంటే.. ఇంటి మూలల్లో రూటర్ ఏర్పాటు చేయాలి.
  • రౌటర్​ను ఇరుగ్గా లేదా సిగ్నల్ రాని చోట పెడితే ఇంటర్నెట్ స్పీడ్ రాదని చెబుతున్నారు. గాలి తగిలే చోట, సిగ్నల్ ఎక్కడైతే ఎక్కువగా వస్తుందో అక్కడ రౌటర్ ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
  • స్మార్ట్ ఫోన్ల దగ్గర నుంచి ఐప్యాడ్స్, స్మార్ట్ టీవీల దాకా.. అందరి ఇళ్లలోకీ వచ్చేశాయి. అయితే ఇన్ని డివైజ్​లు ఒకేసారి వైఫైకి కనెక్ట్ చేస్తే సమస్యలు తప్పవని టెక్ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. ఎక్కువ డివైజెస్ వైఫైకి కనెక్ట్ చేస్తే.. డేటా స్పీడ్ తగ్గడంతో పాటు ఒక్కోసారి కనెక్షన్ పోయే అవకాశం ఉందని చెబుతున్నారు. కనుక మీ డివైజలో ఏది వాడట్లేదో చూసి, దాన్ని డిస్కనెక్ట్ చేయాలి.
  • రూటర్‌ను మనుషులు ఎక్కువగా తిరుగుతున్న ప్రదేశంలో ఉంచొద్దు. ఇంట్లోని డెస్క్, టేబుల్, షెల్ఫ్ వంటి ప్రాంతాల్లో రూటర్‌ను ఉంచకూడదు. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో విద్యుదయస్కాంత వికిరణాన్ని పెంచడంలో సహాయపడతాయి.

NOTE : ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం.

అలర్ట్​ - ఈ ఫుడ్స్​కు దూరంగా ఉండకపోతే - మీ స్ట్రెస్ లెవల్స్ మరింత పెరుగుతాయి! - These Foods Can Increase Stress

ఎంత ట్రై చేసినా బరువు తగ్గట్లేదా? - ఇలా చేస్తే వారానికి అరకిలో తగ్గడం గ్యారెంటీ! - Weight Loss Tips

ABOUT THE AUTHOR

...view details