తెలంగాణ

telangana

ETV Bharat / health

పేషెంట్ల నోరు, కళ్లలో ఫ్లాష్​లైట్ వేస్తే రోగం తెలిసిపోతుందా? డాక్టర్లు ఇలా ఎందుకు చేస్తారంటే? - WHY DOCTORS USE LIGHT TO DIAGNOSE

రోగుల నోరు, కళ్లలో డాక్టర్లు ఫ్లాష్​లైట్​ ఎందుకు వేస్తారు? కాంతితో రోగాన్ని నిర్ధరించొచ్చా?

Why Doctors Use Light To Diagnose
Why Doctors Use Light To Diagnose (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Nov 2, 2024, 5:25 PM IST

Why Doctors Use Light To Diagnose :ఆరోగ్యం బాగలేకపోయినా, తలనొప్పి, కళ్లు తిరగడం, వాంతులు వంటి సమస్యలు వస్తే మనం వైద్యులను సంప్రదిస్తాం. క్లినిక్ లేదా ఆస్పత్రికి వెళ్లిన వెంటనే వైద్యులు పేషెంట్ల నోరు, కళ్లలో ఫ్లాష్​లైట్​ వేస్తారు. అనంతరం అవసరమైన పరీక్షలు చేయించుకోమని సూచిస్తారు. అయితే ఇక్కడ రోగాన్ని నిర్ధరించే క్రమంలో ఫ్లాష్​లైట్​ను ఉపయోగిస్తారు డాక్టర్లు. ఫ్లాష్​లైట్​ ఆధారంగా పేషెంట్​ అనారోగ్యానికి కారణాలను అంచనా వేస్తారు. అయితే లైట్​ ద్వారా వైద్యులు వ్యాధిని ఎలా నిర్ధరిస్తారు? దానికి ఉపయోగించే కొన్ని ఆప్టికల్ టెక్నాలజీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. అన్-ది-స్పాట్​ టెస్ట్​లు
కొన్ని సందర్భాల్లో డాక్టర్లు రోగుల శాంపిళ్లను పరీక్షల కోసం ల్యాబ్​కు పంపించకుండా, అన్-ది-స్పాట్(అక్కడికక్కడే) టెస్ట్​లు చేసి రోగాన్ని నిర్ధరిస్తారు. వైద్యులు, పేషెంట్ల కళ్లలో చూడటానికి ఉపయోగించే ఫ్లాష్​లైట్​ పరికరం-ఆఫ్తల్మోస్కోప్ దీనికి మంచి ఉదాహరణ. డాక్టర్లు ఇలా చేయడం ద్వారా- కంట్లో అసాధారణ రక్త ప్రవాహాన్ని, కార్నియా(కంటి బయట ఉంటే పొర) దెబ్బతినడం, ఆప్టికల్​ డిస్క్​ల్లో(మొదడుకు నరాలకు లింక్ ఉండే కంటి వెనుక ఉన్న రౌండ్ భాగం) వాపును గుర్తిస్తారు. ఆప్టికల్ డిస్క్​ల్లో వాపు ఏర్పడటం, తల లోపల ఒత్తిడికి సంకేతం(కొన్ని సందర్భాల్లో బ్రెయిన్ ట్యూమర్ కావచ్చు). ఇది తలనొప్పికి కారణం కావచ్చు.

ఎల్​ఈడీ లైట్ల ఆవిష్కరణ వల్ల అనేక సూక్ష్మ సాంకేతికతలు పుట్టుకొచ్చాయి. దీంతో ల్యాబ్​ అవసరం లేకుండా ఆస్పత్రిలో బెడ్​ పక్కన, క్లినిక్​లో కొన్ని రోగాల నిర్ధరణ చేసేయొచ్చు. ఇందుకు పల్స్​ ఆక్సిమెట్రీ ఓ మంచి ఉదాహరణ.

ఈ ఆక్సిమెట్రో టెస్టులో మీ చేతి వేలికి ఓ క్లిప్​ అమర్చుతారు. అది మీ రక్తం ఎంత ఆక్సిజనేటెడో చెబుతుంది. వివిధ రంగుల్లో లైట్​ను ప్రసరింపజేసినప్పుడు, ఆక్సిజనేటెడ్​, డీ-ఆక్సిజనేటెడ్​ బ్లడ్​ ఇచ్చే ప్రతిస్పందనలను బట్టి రక్తం ఎంత ఆక్సిజనేటెడో తేలిపోతుంది. అంతేకాకుండా ఈ పల్స్​ ఆక్సిమెట్రీని ఆస్పత్రుల్లో, కొన్ని సందర్భాల్లో ఇంట్లో కూడా ఉపయోగిస్తారు. చిన్నపిల్లల గుండెల్లో ఉన్న లోపాలను గుర్తించడానికి ఆస్పత్రుల్లో ఆక్సిమెట్రీని ఉపయోగిస్తారు.

2. అణువులను (మాలెక్యూల్స్) గుర్తించడం
రక్త పరీక్షలో బ్లడ్​ను విశ్లేషించడం ద్వారా అనేక వ్యాధులను గుర్తించవచ్చు. అటోమేటిక్​గా పనిచేసే "ఫుల్ బ్లడ్ కౌంట్ అనలైజర్" మీ ఆరోగ్యాన్ని అంచనా వేస్తుంది. చిన్న గ్లాస్​ ట్యూబ్​ల్లో ఉండే బ్లడ్​ శాంపిళ్ల గుండా లైట్​ బీమ్స్​ను వేస్తుంది ఈ బ్లట్​ కౌంట్ అనలైజర్. అనంతరం ఎన్ని రక్త కణాలు ఉన్నాయి, అవి ఏ రకం, రక్తంలో హీమోగ్లోబిన్ శాతం ఎంత అనే వివరాలు చెబుతుంది. నిమిషాల్లో ఈ యంత్రం మీ ఆరోగ్యం ఎలా ఉందో ఒక స్నాప్​షాట్​ను అందిస్తుంది.

అంతేకాకుండా, మరికొన్ని నిర్దిష్ట డిసీజ్​ మార్కర్ల(శరీరంలో డీసీజ్​ లేదా వ్యాధి పరిస్థితి ఉందని చెప్పే బయోలాజికల్ కణం) కోసం, సెంట్రిఫ్యూజ్​ అనే పరికరంలో రక్తాన్ని స్పిన్ చేస్తారు. తద్వారా భారీ కణాల నుంచి బ్లడ్​ సీరంను వేరు చేస్తారు. అనంతరం ఆ సీరంను వివిధ రసాయనాలు, ఎంజైమ్​ల అస్సేలతో పరీక్షిస్తారు. సీరం రసాయనాలకు ఎక్స్పోజ్​ అయినప్పుడు- కలర్​ ఛేంజ్​ అవుతుంది. ఇలా కలర్​ ఛేంజ్​ కావడం, వ్యాధికి కారణమైన నిర్దిష్టమైన కణాలు సీరంలో ఉండటంపై ఆధారపడుతుంది.

అయితే రంగులో మార్పును మన కంటితో గుర్తించడం సాధ్యం కాదు. స్పెక్ట్రోమీటర్​ అనే పరికరం ద్వారా వేసే లైట్​ బీమ్​- బ్లడ్​లో ఇలాంటి చిన్న మాలెక్యూల్స్​లను గుర్తిస్తుంది. తద్వారా ఆ శాంపిల్​లో బయోమార్కర్లు ఉన్నాయో లేదో, ఉంటే ఏ స్థాయిలో ఉన్నాయి అనే విషయాలు తెలుసుకోవచ్చు.

3. మెడికల్ ఇమేజింగ్
ఫైబర్-ఆప్టిక్ సాంకేతికత పురోగతి వల్ల లైట్​ను శరీరంలోకి వెళ్లేలా చేయొచ్చు. తద్వారా హై-రిసొల్యూషన్ ఆఫ్టికల్​ ఇమేజింగ్​ సాధ్యమవుతుంది. దీనికి ఎండోస్కోప్​ మంచి ఉదాహరణ. ఎండోస్కోప్​లో మీ పొట్ట, లేదా శ్వాస నాళాలను పరిశీలించడానికి- చివరన చిన్న కెమెరాతో ఉన్న ఫైబర్​ను శరీరంలోకి చొప్పిస్తారు. అంతేకాకుండా లాప్రోస్కోపిక్​ సర్జరీని వీడియో స్క్రీన్​పై చూడటానికి ఈ సాంకేతికతను ఉపయోగిస్తారు.

భవిష్యత్తులో​ ఎలా?
నానో టెక్నాలజీలో పురోగతి, కణజాలం-లైట్​ పరస్పర చర్యల గురించి మెరుగైన అవగాహన ఉండటం- కొత్త లైట్​ బేస్డ్​ ఆవిష్కరణలకు దారి తీస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీలు ఇవే.

  • నానో మెటీరియల్స్​ : నానో మెటీరియల్స్​ను​ (చాలా చిన్న సైజులో ఉంటే పదార్థాలు, మానవ జుట్టు కన్నా అనేక రెట్లు చిన్నవి) నెక్స్ట్​ జనరేషన్​ సెన్సార్లు, కొత్త డయాగ్నాస్టిక్​ పరికారాల్లో వినియోగిస్తున్నారు. భవిష్యత్తులో వీటిని ఉపయోగించి అనేక ఆవిష్కరణలు వచ్చే అవకాశం ఉంది.
  • వేలి గోరు అంత సైజు ఉండే వేరెబుల్ ఆప్టికల్​ బయో సెన్సార్లు : వీటిని వాచ్​లు, కాంటాక్ట్​ లెన్స్​లు, ఫింగర్​ రాప్స్​లో వినియోగిస్తారు. ఈ పరికరాలు రియల్​ టైమ్​లో చెమట, కన్నళ్లు, లాలాజం నాన్​-ఇన్వాసివ్​ కొలతలు చేపట్టేందుకు ఉపయోగపడుతాయి.
  • ఇన్​ఫ్రా రెడ్​ కాంతిని బ్లడ్​ సీరం ఎలా స్కాటర్​ చేస్తుందో విశ్లేషించే ఏఐ టూల్స్​ : క్యాన్సర్లను గుర్తించే స్కాటర్​ నమూనాల డేటాబేస్​ను అభివృద్ధి చేయడానికి ఈ టూల్స్​ ఉపయోగపడతాయి.
  • ఆప్టికల్ కొహెరెన్స్​ టోమోగ్రఫీ-ఇది ఒక రకమైన నాన్​-ఇన్వేసివ్ ఇమేజింగ్. దీని ద్వారా కంటి, గుండె, చర్మం డీటెయిల్డ్​ ఇమేజింగ్​ చేయొచ్చు.
  • ఫైబర్​ ఆప్టిక్ టెక్నాలజీ- దీనివల్ల, సూది కొనకు మైక్రోస్కోప్ అమర్చి శరీరంలోకి చొప్పించొచ్చు.

ABOUT THE AUTHOR

...view details