Ginger Health Benefits And Side-Effects :మన డైలీ తాగే ఛాయ్‌లో కాస్త అల్లం దంచి వేశామంటే ఆ రుచే వేరు. ముఖ్యంగా జలుబు, గొంతులో కిచ్ కిచ్ వంటి సమస్యలున్నప్పుడు అల్లం తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. అంతేకాదు, కూరల్లో కూడా భారతీయులు దీన్ని మిస్ చేయకుండా వాడతారు. అల్లం ఆహార పదార్థాలకు మంచి వాసనను, రుచిని అందిస్తుంది కనుక దీన్ని ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా వాడతారు. ఆరోగ్య ప్రయోజనాల్లోనూ అల్లం ఏం తక్కువ చేయదని నిపుణులు చెబుతుంటారు. జింజర్ షోగోల్, జింజెరోన్ వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఇవి ఆహారం రుచిని పెంచడం సహా ఔషధ లక్షణాలను జోడించి ఆరోగ్యాన్ని కాపాడతాయి.
అయితే ఇవన్నీ అల్లం మితంగా తిన్నప్పుడే జరుగుతాయట. మంచిది కదా అని అతిగా తీసుకుంటే ఏ ఆహారమైనా అనారోగ్యానికి దారితీస్తుంది. అల్లం కూడా ఆ కోవకు చెందిందేనని కొన్ని స్టడీలు చెబుతున్నాయి. అల్లం అతిగా తినడం వల్ల కొన్ని ప్రతికూల ప్రయోజనాలను ఎదుర్కోవాల్సి వస్తుందట.
జీర్ణ సమస్యలు:సాధారణంగా అరుగుదల బాగా లేనప్పుడు, వికారంగా అనిపించినప్పడు అల్లం తీసుకోవడం వల్ల చక్కటి ఉపశమనం లభిస్తుంది. అలాగని అతిగా తిసుకున్నారంటే సమస్య మరింత పెద్దది అవుతుంది. అల్లం అతిగా తినడం వల్ల కొందరికి గుండెల్లో మంట, ఉబ్బరం, జీర్ణ సమస్యలు వంటివి తలెత్తుతాయి.
రక్తం పలుచబడటం:అల్లంలో సహజంగా రక్తాన్ని పలుచబరిచే లక్షణాలుంటాయి. ఇవి రక్తప్రసరణతో పాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అయినప్పటికీ అల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తం బాగా పలుచగా మారి రక్తస్రావ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మరీ ముఖ్యంగా రక్తస్రావ రుగ్మతలు ఉన్నవారు అల్లం ఎక్కువ తినకూడదు.