Weight Loss Drinks In Summer :బరువు తగ్గాలనుకునే వారు తక్కువ క్యాలరీలున్న ఆహారం తీసుకోవాలి. కాబట్టి.. సమ్మర్‌లో వీలైనంతగా మజ్జిగ తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే ఇందులో ప్రొటీన్‌అధికంగా ఉండటం వల్ల ఎక్కువ సేపు ఆకలి కాకుండా ఉంటుంది. అలాగే మజ్జిగలో పొటాషియం, సోడియం వంటి ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చెమట ద్వారా కోల్పోయిన ఖనిజాలను శరీరానికి అందిస్తాయని నిపుణులంటున్నారు. అంతేకాదు.. వాటర్ కంటెంట్ పొట్టలో ఎక్కువగా ఉన్నప్పుడు.. తిండి ఎక్కువగా తినే అవకాశం ఉండదు. ఈ విధంగా కూడా బరువు తగ్గే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు.
అధిక బరువుతో బీపీ వేధిస్తోందా? - వెయిట్ లాస్ సర్జరీతో చెక్ పెట్టొచ్చా?!
నిమ్మరసం :
వేసవి కాలంలో నిమ్మరసం తాగడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా పని చేస్తుంది. ఇందులో ఉండే పెక్టిన్ అనే ఫైబర్.. కొవ్వును కరిగిస్తుంది. అలాగే ఆకలిని నియంత్రిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా నిమ్మరసంలో ఉండే ఎలక్ట్రోలైట్లు బాడీని డీహైడ్రేట్ కాకుండా చూస్తాయని అంటున్నారు.
జీలకర్ర వాటర్ :
బరువు తగ్గాలనుకునే వారు రాత్రి ఒక గ్లాసులో టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని.. ఉదయాన్నే పరగడుపున ఆ నీటిని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుందట. జీలకర్రలో ఉండే కెటోన్స్ అనే సమ్మేళనాలు కొవ్వును కరిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ డ్రింక్ వల్ల ఆహారం కూడా సులభంగా జీర్ణమవుతుందట. ఇంకా జీలకర్ర నీళ్లు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉండేలా చేస్తాయని అంటున్నారు.
దోసకాయ నీరు : దోసకాయలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహర పదార్థం. వేసవి కాలంలోవెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు డైలీ దోసకాయ వాటర్ తాగడం వల్ల ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇందులో ఉండే పోషకాలు శరీరాన్ని హ్రైడ్రేట్‌గా ఉండేలా చేస్తాయని అంటున్నారు.