Walking Vs Climbing Stairs Which is Best For Weight Loss :మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం వంటి వివిధ కారణాల వల్ల చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. వెయిట్‌లాస్ అవ్వడానికి వివిధ రకాల వ్యాయామాలు చేస్తూ, కఠినమైన డైట్‌ను పాటిస్తుంటారు. అయితే, బరువు తగ్గడానికి కొంత మంది వాకింగ్ చేస్తే.. మరికొంత మంది స్టెప్స్ ఎక్కుతుంటారు. మరి ఈ రెండింటిలో ఏది బరువు తగ్గడానికి సహాయపడుతుందో ఇప్పుడు చూద్దాం.
మెట్లు ఎక్కడం వల్ల కలిగే లాభాలు :
బరువు తగ్గడానికి: మెట్లు ఎక్కడం వల్ల తొడలు, కాళ్లలోని కొవ్వు కరుగుతుందని.. అలాగే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మెట్లు ఎక్కడ వల్ల మూడు రెట్లు వేగంగా ఫ్యాట్ బర్న్ అవుతుందట. దీనివల్ల త్వరగా బరువు తగ్గే అవకాశం ఉందంటున్నారు. 2001లో 'అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్'లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. అధిక బరువుతో బాధపడేవారు మెట్లు ఎక్కడం వల్ల బరువుతగ్గే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ డేవిడ్ జె. లెవి పాల్గొన్నారు.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:మెట్లు ఎక్కడం వల్ల గుండె వేగంగా కొట్టుకుంటుందని తద్వారా రక్త ప్రసరణ పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. క్రమం తప్పకుండా మెట్లు ఎక్కడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్, అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుందని అంటున్నారు. అయితే గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఎక్కువగా మెట్లు ఎక్కడం మంచిది కాదని.. అధిక రక్తపోటుతో బాధపడేవారు కూడా డాక్టర్ సూచనల ప్రకారం మెట్లు ఎక్కాలని సూచిస్తున్నారు.
మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది: వ్యాయామం ఎండార్ఫిన్ల విడుదలను ప్రేరేపిస్తుందని.. ఇవి మానసిక స్థితిని మెరుగుపరచడంలో, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయని అంటున్నారు. అలాగే మెట్లు ఎక్కడం వల్ల ఆందోళన, నిరాశ లక్షణాలు తగ్గుతాయని చెబుతున్నారు.
బెల్లీ ప్యాట్ తగ్గాలా? ఇష్టమైన ఫుడ్ తింటూనే ఈ టిప్స్ పాటిస్తే చాలు! - Ayurvedic Tips for Belly Fat