Uses Of Vaseline Jelly : చిన్నప్పటి నుంచి పెదాలు పగిలినా, చర్మం పొడిగా మారిన మనం రాసుకునే పెట్రోలియం జెల్లీ అదేనండి వాజిలిన్. ఈ క్రీమ్ గురించి మనకు తెలియని ఆశ్చర్యకరమైన విషయాలు చాలా ఉన్నాయట. సరిగ్గా ఉపయోగిస్తే వాసెలిన్ మనల్ని ఎన్నో రకాల సమస్యల నుంచి దూరంగా ఉంచుతుందని నిపుణులు అంటున్నారు. అవేంటో ఆలస్యం చేయకుండా చూసేద్దామా మరి.
పర్ఫ్మూమ్ ఎక్కువ కాలం ఉండేందుకు!
చెమట, దుర్వాసన నుంచి తప్పించుకునేందుకు మనం రోజూ రాసుకునే పర్ఫ్యూమ్ ఎక్కువ సేపు ఉండేందుకు వాసెలిన్ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. పర్ఫ్యూమ్ రాసుకునే ముందు కొంచెం పెట్రోలియం జెల్లీని రాసుకోవడం వల్ల పర్ఫ్యూమ్ ఎక్కువ సేపు ఉంటుందట.
చర్మం ముడతలకు!
చర్మం పగుళ్లకు మాత్రమే కాదు, ముడతలతో ఇబ్బంది పడుతున్నవారికి కూడా ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. మాయిశ్చరైజింగ్ లక్షణాలున్న వాజిలిన్ ప్రతి రోజూ రాసుకోవడం వల్ల చర్మం ముడతలు తగ్గిపోతాయట.
చిట్లిన వెంట్రుకలకు!
వెంట్రుకల చివర్లు చిట్లిపోయాయంటే ఎదుగుదల ఆగిపోయినట్టే, జుట్టు ఆరోగ్యం దెబ్బతిన్నట్లే. అలాంటప్పడు వాజిలిన్ మీకు అద్భుతంగా పనికొస్తుంది. చిట్లిన వెంట్రుకలకు తరచుగా వాజిలిన్ రాసుకోవడం వల్ల వెంట్రుకలు తిరిగి ఆరోగ్యంగా మారడమే కాదు జుట్టు మృదువుగా, మెరిసేలా తయారవుతుంది.
పెంపుడు జంతువుల పాదాలకు!
మీరు జంతుప్రియులైతే, మీ ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే మీకు పెట్రోలియం జెల్లీ బాగా ఉపయోగపడుతుంది. ఇవి మీ కుక్క లేదా పిల్లి పాదాలకు తేమ అందించడంలో, సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది.
ఫర్నీచర్ కోసం!
ఇంట్లో బల్లలు, బెడ్ల మీద గీతలు పడి చూడటానికి అసహ్యంగా కనిపిస్తుంటుంది. అలాంటి సందర్భాల్లో గీతలు పడ్డచోట వాజిలిన్ రాసి రాత్రంతా అలాగే ఉంచండి. మరుసటి రోజు క్లాత్‌తో తుడిచేయండి. రిజల్ట్ చూసి మీరే షాక్ అవుతారు.