Tips to Clean Stainless Steel: స్టెయిన్ లెస్ స్టీల్ గృహోపకరణాలు శుభ్రంగా ఉన్నప్పుడు తళతళలాడుతూ ఎంత మంచి లుక్‌ని ఇస్తాయో, వాటి మీద గీతలు పడినా లేదా వాటిని సరిగ్గా శుభ్రం చేయకపోయినా పాత వాటిలా కనిపిస్తాయి. ముఖ్యంగా మనం రోజువారీ ఉపయోగించే వస్తువులను శుభ్రం చేసే విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. సరిగ్గా శుభ్రం చేయకుండా ఉపయోగించడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి శుభ్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ క్రమంలో వాటిని క్లీన్ చేయడమే కాకుండా కొత్తవాటిలా మెరిపించేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవి ఈ స్టోరీలో చూద్దాం.
డిష్ సోప్:రోజువారీ ఉపయోగించే వంటపాత్రలే కాకుండా కొన్ని గృహోపకరణాలపై (రిఫ్రిజిరేటర్స్, ఓవెన్) మరకలు శుభ్రం చేసేందుకు కూడా ఓ పద్ధతి ఉంది. దీని ప్రకారం ముందుగా చల్లని నీళ్లతో వాటిపై ఎలాంటి మరకలు లేకుండా ఓ క్లాత్ సాయంతో పైపైన తుడవాలి. తర్వాత మెత్తని స్పాంజ్‌తో గోరువెచ్చని నీళ్లలో కలిపిన డిష్ సోప్ మిశ్రమాన్ని ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. తర్వాత మైక్రోఫైబర్ క్లాత్‌తో శుభ్రంగా తడి లేకుండా తుడిచి కాసేపు ఆరబెట్టాలి.
గ్లాస్ క్లీనర్:ఇక డిష్సోప్తో మరకలు పోకపోతే అందుకోసం గ్లాస్ క్లీనర్‌ను యూజ్ చేయవచ్చు. ముందుగా మైక్రోఫైబర్ క్లాత్‌పై ఈ లిక్విడ్‌ను స్పే చేసి మరకలపై రుద్దాలి. తర్వాత వేరే తడి క్లాత్ తీసుకుని తుడిచిన తర్వాత, మరో క్లాత్‌తో తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి.
వైట్ వెనిగర్ :స్టెయిన్ లెస్ స్టీల్ పాత్రలను క్లీన్ చేయడానికి వెనిగర్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు. ఇందుకోసం మైక్రోఫైబర్ క్లాత్‌పై కొద్దిగా డిస్టిల్డ్ వైట్ వెనిగర్‌ను స్ప్రే చేసి మరకలపై రుద్దాలి. తర్వాత వేరే తడి క్లాత్ తీసుకుని తుడిచిన తర్వాత, మరో క్లాత్‌తో తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. ఈ పద్ధతి ముఖ్యంగా ధూళి, ఫింగర్‌ప్రింట్స్‌ను తొలగించడంలో సాయపడుతుంది. అయితే ఇతర క్లీనర్ల కంటే వెనిగర్‌లో కొంచెం ఎక్కువ ఆమ్లం ఉంటుంది. కాబట్టి మీరు దానిని గృహోపకరణాలపై ఉపయోగించినప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
స్టెయిన్‌లెస్ స్టీల్ క్లీనర్:పైన చెప్పిన టిప్స్ పాటించి ఈ గృహోపకరణాలను క్లీన్ చేసినా జిడ్డు, మరకలు పోకపోతే ఇక చివరగా మార్కెట్లో స్టెయిన్ లెస్ స్టీల్ క్లీనర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ క్లీనర్‌ను యూజ్ చేసి ఎంత మొండి మరకలనైనా శుభ్రం చేయవచ్చు. ఇందుకోసం మైక్రోఫైబర్ క్లాత్‌పై కొద్దిగా క్లీనర్‌పై స్ర్పే చేసి క్లీన్ చేయాలి.