తెలంగాణ

telangana

ETV Bharat / health

నాన్​వెజ్ తింటే కొలెస్ట్రాల్ - తినకుండా ఉండలేం ఎలా బ్రో? - ఇవి లాగించండి బ్రో!

Cholesterol Reduce Foods : నాన్ వెజ్ తినే వారందరికీ దాదాపుగా వారానికి ఒకసారి కావాల్సిందే. మరికొందరైతే మూడ్నాలుగు రోజులు లాగిస్తుంటారు. ఇలాంటి వారు హై కొలెస్ట్రాల్​తో బాధపడుతుంటారు. తింటే కొవ్వు ఇంకా పెరుగుతుంది. తినకపోతే ఉండలేరు. ఇలా నలిగిపోయేవారు చేపలు తింటే మంచిదని సూచిస్తున్నారు నిపుణులు!

Cholesterol
Cholesterol Reduce Foods

By ETV Bharat Telugu Team

Published : Mar 2, 2024, 10:40 AM IST

These Foods Reduce Bad Cholesterol : మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం కారణంగా.. ఎక్కువ మంది హై కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్​తో ఇబ్బంది పడుతున్నారు. వీరిలో కొందరు ఎలాగైనా బాడీలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్(Cholesterol)స్థాయిలను తగ్గించాలని తీవ్ర కసరత్తులు చేస్తుంటారు. నాన్ వెజ్ పూర్తిగా బంద్ చేస్తారు. కానీ.. ఎక్కువ కాలం ఉండలేరు. మనసు కోరుతూ ఉంటుంది. ఇలాంటి వారు కొన్ని చేపలను డైట్​లో చేర్చుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

చేపలతోపాటుగా.. తాజా కూరగాయలు, ఫ్రూట్స్, తృణధాన్యాలు నిత్యం తీసుకోవాలని చెబుతున్నారు. ఇవి బాడీకి కావలసిన ఆరోగ్యకరమైన కొవ్వులను పెంచి అనారోగ్యకరమైన కొవ్వును ఇట్టే తగ్గిస్తాయని చెబుతున్నారు. అలాగే.. బాడీలో చెడు కొలెస్ట్రాల్​ను తగ్గించుకోవాలనుకునేవారు అల్పాహారంగా ఓట్ మీల్ తీసుకోవడం మంచిదంటున్నారు.

హై కొలెస్ట్రాల్ భయపెడుతోందా? - ఈ డ్రింక్స్ తాగారంటే ఐస్​లా కరిగిపోద్ది!

సాల్మన్ ఫిష్ :అధిక కొవ్వుతో బాధపడేవారికి సాల్మన్ ఫిష్ చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు దండిగా ఉంటాయి. ఇవి రక్తంలో ట్రైగ్లిజరైడ్స్​ను తగ్గిస్తాయి. మొత్తం కొలెస్ట్రాల్ తగ్గడంలోనూ చాలా బాగా సహాయపడతాయి. అలాగే.. రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటాన్నీ నివారిస్తాయి. కాబట్టి.. మీ డైట్​లో సాల్మన్ చేపలు ఉండేలా చూసుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు.

టూనా ఫిష్ :ఇందులో కూడా ఓమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి.

ట్రౌట్ ఫిష్ :ఈ చేపలోనూ ఓమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను మెయింటెయిన్ చేయడానికి సహాయపడుతాయి.

హెర్రింగ్ ఫిష్ :ఈ చేపలు ఈపీఏ, డీహెచ్​ఏ అనే రెండు రకాల ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్‌లను అందిస్తాయి. ఇవి వాపు తగ్గించడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలా బాగా సహాయపడతాయి. అలాగే.. ఇందులో విటమిన్ డి కూడా ఉంటుంది.

మాకేరెల్ ఫిష్ : దీనిలో కూడా ఓమెగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.

ఇవేకాకుండా.. సార్​డైన్, స్వోర్డ్ చేపలు కూడా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందువల్ల.. వారానికి కనీసం రెండు లేదా మూడుసార్లు ఈ చేపలు మీ డైట్​లో ఉండేలా చూసుకుంటే హై కొలెస్ట్రాల్​ ప్రాబ్లమ్​ నుంచి బయటపడవచ్చంటున్నారు. అయితే.. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. వీటిని కూరగానో, ఉడికించో తినాలి. అంతేకానీ ఎట్టి పరిస్థితుల్లో నూనెలో వేయించి తీసుకోవడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గాలా? పరగడుపున ఈ 'ఐదు' ఆకులు తింటే చాలు!

ABOUT THE AUTHOR

...view details