తెలంగాణ

telangana

ETV Bharat / health

విటమిన్​ 'డి' తక్కువైతే ఇన్ని సమస్యలా! సొల్యూషన్ ఏంటో తెలుసా? - How To Increase Vitamin D Levels

How To Increase Vitamin D Levels : ఒకప్పుడు ఆరుబయట చాలా ప్రశాంతంగా, ఎండ తగిలేలా కాసేపైనా అందరూ పని చేసేవాళ్లు. కానీ ఇప్పుడు ఏసీ రూములు, వెలుతురు రాని గోడల వల్ల సూర్యరశ్మి మనల్ని చేరట్లేదు. ఫలితంగా రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా విటమిన్ డి లోపం అనేది చాలామందిని వేధిస్తోంది. విటమిన్ డి లోపాన్ని ఎలా అధిగమించాలో, విటమిన్ డి లోపం వల్ల తలెత్తే సమస్యలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

How To Increase Vitamin D Levels
How To Increase Vitamin D Levels

By ETV Bharat Telugu Team

Published : Mar 17, 2024, 7:45 AM IST

How To Increase Vitamin D Levels :పూర్వం ఉదయం లేచి కాసేపు ఎండలో పనులు చేసేవాళ్లు. దాని వల్ల శరీరానికి తగినంత సూర్యరశ్మి అందేది. ఫలితంగా విటమిన్ డి లోపం అనేది కనిపించేది కాదు. అందుకే సూర్యరశ్మికి కొదవ లేని మన దేశంలో విటమిన్ డి లోపం అనేది ఎప్పటికీ రాదు అని చాలామంది భావించే వాళ్లు. కానీ తాజా అధ్యయనాలు మాత్రం దేశంలో విటమిన్ డి లోపం సమస్య అంతకంతకు పెరుగుతున్నట్లు చెబుతున్నాయి. చాలామంది ఎండకు ఎక్స్ పోజ్ కాకపోవడమే ఇందుకు కారణం.

ఏసీ రూములకు పరిమితం కావడం, ఇండోర్​లో పని చేసుకోవడం, ఎండలకు అస్సలు బయటకు రాకపోవడం ఇలా అనేక కారణాల వల్ల చాలామంది ఎండను ఒంటి మీద పడనివ్వట్లేదు. దీని వల్ల విటమిన్ డి లోపం ఏర్పడుతోంది. మన శరీరానికి అవసరమైన కీలక విటమిన్లలో విటమిన్ డి కూడా ఒకటి. ఇది లేకపోయినా, తక్కువైనా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే రోజులో కాసేపైనా ఎండలో ఉండాలని వైద్యులు సూచిస్తుంటారు.

ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ మధులిక ఆరుట్ల ప్రకారం, రూపాయి ఖర్చు లేకుండా రోజులో కేవలం 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు ఎండలో నిల్చుంటే విటమిన్ డి లోపాన్ని అధిగమించవచ్చు అంటున్నారు. శరీరం మీద సూర్యరశ్మి పడితే మన శరీరంలోని చర్మం కింది కణాలు విటమిన్ డిని సొంతంగా తయారు చేసుకోగలవని చెబుతున్నారు. ఈ చిట్కా పాటిస్తే ఎలాంటి ఆహారాలు, మందులతో అవసరం లేకుండా విటమిన్ డి లోపాన్ని అధిగమించడానికి వీలుంటుందని డాక్టర్ మధులిక వివరిస్తున్నారు.

అలా కాకుండా పాలు, పాల పదార్థాలైన నెయ్యి, వెన్న, మజ్జిగ లాంటివి తీసుకోవడం వల్ల శరీరానికి విటమిన్ డి లభిస్తుందని అంటున్నారు. అలాగే మాంసం, గుడ్లు తినడం వల్ల కూడా విటమిన్ డి లభిస్తుందని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ మధులిక ఆరుట్ల వివరించారు. కేవలం 10 నుంచి 15 నిమిషాల పాటు మన శరీరాన్ని ఎండకు ఎక్స్ పోజ్ చెయ్యడం వల్ల విటమిన్ డి లోపాన్ని నివారించవచ్చని, ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఎప్పుడైనా ఎండకు ఉంటే ఈ ఫలితం దక్కుతుందని అంటున్నారు.

విటమిన్ డి లోపం వల్ల తలెత్తే సమస్యలు
మన శరీరానికి అవసరమైన విటమిన్ డి లోపిస్తే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందులో ముఖ్యమైనది మోకాళ్ల నొప్పులు. వయసుతో సంబంధం లేకుండా విటమిన్ డి లోపిస్తే మోకాళ్ల నొప్పులు వస్తాయి. అలాగే నిద్రలేమి, ముభావంగా ఉండటం, బరువు పెరగడం లాంటి లక్షణాలు విటమిన్ డి లోపం వల్ల తలెత్తుతాయి. చాలామందిలో విటమిన్ డి లోపం వల్ల నిద్ర సరిగ్గా పట్టదు. ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలకు గురవుతుంటారు.

ఈజీగా వెయిట్​ లాస్​ అవ్వాలనుకుంటున్నారా? - అయితే ఈ చియా సీడ్స్ రెసిపీలు ట్రై చేయాల్సిందే!

రోజూ అరటిపండు తింటే బరువు పెరుగుతారా? తగ్గుతారా?

ABOUT THE AUTHOR

...view details