Encephalitis Symptoms :మెదడు వాపు వ్యాధి అనేది పలు కారణాల వల్ల వస్తుంది. బ్రెయిన్లోని నాడీ కణాలలో వాపు ఏర్పడి, వాటి పని తీరులో అవరోధాలు ఏర్పడటం వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి తీవ్రతను బట్టి.. స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక మెదడు వాపు వ్యాధిగా విభజిస్తారు. స్వల్పకాలిక మెదడు వాపు తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
ఈ వ్యాధి చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మరణాల సంఖ్య కూడా పిల్లల్లోనే ఎక్కువగా ఉంటుంది. అందువల్ల.. మెదడు వాపు వ్యాధి గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. మరి మెదడు వాపు వ్యాధికి గల కారణాలేంటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలా నిర్ధారిస్తారు? వంటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
వ్యాధి కారణాలు:సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ వ్యాధి వస్తుంది. బాక్టీరియా కూడా మెదడువాపునకు కారణమవుతుంది. ముఖ్యంగా.. జపనీస్ ఎన్సెఫలైటిస్ (JE) వైరస్, హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ (HSV), మీజిల్స్ వైరస్, రాబిస్ వైరస్, ఇన్ఫ్లూయెంజా వైరస్ వల్ల మెదడువాపు వ్యాధి ఎక్కువగా వస్తుంది. అయితే.. ఈ వైరస్లు డెంగ్యూ దోమల ద్వారా వ్యాప్తి చెందుతాయి. అంతేకాకుండా బ్యాక్టీరియా, పారసైట్స్ కూడా మెదడువాపు వ్యాధిని కలిగించవచ్చు. విషపదార్థాలు, ఆటో ఇమ్యూనిటీకి సంబంధించిన వ్యాధుల వల్ల, అరుదుగా వాడే పలు వ్యాక్సిన్ల వల్ల కూడా మెదడువాపు వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది.
పచ్చి ఉల్లిపాయ తింటున్నారా - ఏమవుతుందో తెలుసా?
వ్యాధి లక్షణాలు:ఈ వైరస్ మెదడులో ప్రవేశించిన ప్రతి వ్యక్తికీ మెదడువాపు వ్యాధి రాదు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారే ఎక్కువగా ప్రభావితమవుతారు. ఈ వ్యాధి లక్షణాలు రెండు రకాలుగా ఉంటాయి. అవి తేలికపాటి, తీవ్రమైన లక్షణాలు. తేలికపాటి లక్షణాలు ఈ కింది విధంగా ఉంటాయి.
తేలికపాటి లక్షణాలు:
- తలనొప్పి
- జ్వరం
- కండరాల నొప్పులు
- కీళ్లలో నొప్పి
- బలహీనత
- అలసట