Summer Skincare Tips : సమ్మర్‌లో ఓవైపు ఎండవేడి, చెమట, ఉక్కపోత మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. మరోవైపు చెమట కాయలు, ట్యాన్, సన్‌బర్న్ వంటి స్కిన్ ప్రాబ్లమ్స్ వెంటాడుతుంటాయి. వీటి కారణంగాచర్మంఎర్రగా మారడం, దురద వంటి సమస్యలు ఎంతో చికాకు పెట్టిస్తుంటాయి. అయితే, ఈ ప్రాబ్లమ్స్‌తో బాధపడేవారు కొన్ని టిప్స్ పాటించడం వల్ల ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
టీ ట్రీ ఆయిల్‌తో :కొంతమందిలో చెమట కాయలు ఎర్రగా మారి, మంట, దురద వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే, ఇలాంటి వారు టీ ట్రీ ఆయిల్‌ను ఉపయోగించడం వల్ల ఈ లక్షణాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. మంట, దురద ఎక్కువగా ఉన్నప్పుడు టీ ట్రీ ఆయిల్‌లో ముంచిన దూదితో వాటిపై మృదువుగా అద్దుకోవడం వల్ల కాస్త ఉపశమనం లభిస్తుందని అంటున్నారు.
కలబందతో:సమ్మర్‌లో కొంత మందికి వీపు, మెడ వంటి ఇతర భాగాల్లో ఎక్కువగా చెమట కాయలు వస్తుంటాయి. అయితే, ఈ సమస్యతో బాధపడేవారు కలబంద గుజ్జు లేదా కలబంద జెల్ తీసుకుని చెమట కాయలు ఉన్న చోట కాసేపు రుద్దుకోవాలి. తర్వాత చల్లటినీళ్లతో క్లీన్ చేసుకోవాలి. ఇలా రోజుకి రెండుసార్లు వారం రోజుల పాటు చేయడం వల్ల చెమట కాయలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే సన్‌బర్న్, ట్యానింగ్ వంటి సమస్యల నుంచి కూడా విముక్తి పొందవచ్చని అంటున్నారు.
2017లో 'ఫిట్టోథెరపీ రీసెర్చ్ జర్నల్'లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. చెమట కాయలు ఉన్న చోట కలబంద జెల్‌తో మర్దన చేయడం వల్ల ఎరుపు, వాపు తగ్గిందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో ఇరాన్‌లోని టెహ్రాన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో పని చేసే డాక్టర్. షాహిన్ ఘరాఘి పాల్గొన్నారు. చెమట కాయల సమస్యతో బాధపడేవారు కలబంద జెల్ అప్లై చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.