Avoid These Sleeping Mistakes For Skin Care : వయసుతో సంబంధం లేకుండా కొందరిని మొటిమలు వేధిస్తుంటాయి. అయితే.. ఈ మొటిమలు(Pimples) రావడానికి కేవలం హార్మోనల్ ఛేంజస్ మాత్రమే కాకుండా.. నిద్రపోయేటప్పుడు చేసే పొరపాట్లు కూడా ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మేకప్ : కొంతమంది తరచూ మేకప్ వేసుకుంటారు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత.. ఓపిక లేదంటూ మేకప్ తొలగించకుండానో.. లేదంటే పైపైన తొలగించుకొని నిద్రపోతారు. ఈ కారణంగా మొటిమలు వస్తాయంటున్నారు ప్రముక డెర్మటాలజిస్ట్ డాక్టర్ వాటెన్బర్గ్. ఎందుకంటే.. మీరు మేకప్ తొలగించని కారణంగా చర్మ రంధ్రాల్లో మేకప్ అవశేషాలు ఉండిపోయి మూసుకుపోతాయట. ఫలితంగా మొటిమలు వచ్చే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి, ఈ సమస్య రాకుండా ఉండాలంటే.. మేకప్ పూర్తిగా తొలగించుకున్నాకే నిద్రపోవడం మంచిదంటున్నారు. అప్పుడే చర్మానికి రక్తప్రసరణ కూడా మెరుగై.. మేను కాంతివంతంగా మారుతుందని సూచిస్తున్నారు.
వాటిని మార్చకపోవడం : చాలా మంది చేసే మరో పొరపాటు ఏంటంటే.. దిండు కవర్లను రోజుల తరబడి వాష్ చేయకుండా, మార్చకుండా వాడుతుంటారు. దీని కారణంగా మొటిమలు వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. నార్మల్‌గా స్కిన్ రిలీజ్ చేసే నూనెలు, చెమట, బ్యాక్టీరియాతో పాటు మృతకణాలూ దిండు పైకి చేరతాయి. దాంతో అదే దిండును ఎక్కువ రోజులు వాడడం వల్ల అవి చర్మ రంధ్రాల్లోకి చేరి.. వాటిని మూసేస్తాయి. ఫలితంగా మొటిమలొస్తాయంటున్నారు. కాబట్టి, అలా జరగకుండా ఉండాలంటే.. వారానికి ఓసారి తప్పకుండా దిండు కవర్లను మార్చడం, దిండ్లను వాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేసుకోవాలి. అలాగే.. వీలైనంత వరకు ఒకరు ఉపయోగించిన దిండ్లు మరొకరు వాడకుండా చూసుకోవడం మంచిదంటున్నారు.
పెళ్లి తర్వాత మొటిమలు వస్తున్నాయా? - ఇలా ఈజీగా తగ్గించుకోండి!