తెలంగాణ

telangana

ETV Bharat / health

రోజూ నానబెట్టిన బాదం పప్పులు తింటే - ఈ చర్మ సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు! - Soaked Almonds Skin Benefits - SOAKED ALMONDS SKIN BENEFITS

Skin Benefits Of Eating Soaked Almonds : నానబెట్టిన బాదం పప్పులు ఉదయాన్నే తినడం ద్వారా పలు ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని చాలా మందికి తెలుసు. అయితే.. చర్మ సమస్యలకు కూడా వీటితో చెక్ పెట్టొచ్చని మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Soaked Almonds
Skin Benefits Of Eating Soaked Almonds (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : May 22, 2024, 10:29 AM IST

Skin Benefits Of Eating Soaked Almonds : ప్రస్తుత కాలంలో ప్రజలకు ఆరోగ్యం పట్ల స్పృహ పెరిగింది. అనారోగ్యం బారిన పడకుండా ఉండటానికి సమతుల ఆహారం తీసుకుంటూనే.. నట్స్‌, డ్రై ఫ్రూట్స్‌ వంటి వాటిని తీసుకుంటున్నారు. అయితే.. కొంత మంది నైట్‌ పడుకునే ముందు బాదం పప్పులను నానబెట్టి ఉదయాన్నే తింటారు. ఇలా ఖాళీ కడుపుతో నానబెట్టిన బాదం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలనుపొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఇలా నానబెట్టిన బాదం పప్పులనుతినడం వల్ల చర్మ సమస్యలకూ చెక్ పెట్టొచ్చని అంటున్నారు. మరి.. వీటిని తినడం వల్ల కలిగే స్కిన్‌ బెన్‌ఫిట్స్‌ ఏంటో మీకు తెలుసా ? ఇప్పుడు చూద్దాం.

చర్మం హైడ్రేట్‌గా ఉంటుంది :
బాదంపప్పులో విటమిన్ E అధికంగా ఉంటుంది. ఇది ఒక శక్తివంతమైన ఒక యాంటీఆక్సిడెంట్‌. రోజూ నానాబెట్టిన బాదం పప్పులను తినడం వల్ల చర్మం హైడ్రేట్‌గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వీటిని డైలీ తీసుకోవడం వల్ల చర్మం మృదువుగా, మెరుస్తుందని అంటున్నారు. అలాగే చర్మంపై ముడతలు రాకుండా అడ్డుకుంటుందని పేర్కొన్నారు. 2017లో 'డెర్మటాలజీ రీసెర్చ్ అండ్ ప్రాక్టీస్ జర్నల్'లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. నానబెట్టిన బాదంపప్పు తినడం వల్ల చర్మం హైడ్రేషన్‌గా ఉండటంతోపాటు, ముడతలు తగ్గుతాయని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో స్పెయిన్‌లోని కంప్లూటెన్స్ విశ్వవిద్యాలయానికి చెందిన డెర్మటాలజీ ప్రొఫెసర్ 'డాక్టర్‌ మారియా కాస్టిల్లో' పాల్గొన్నారు. రోజూ నానబెట్టిన బాదం తినడం వల్ల చర్మం హైడ్రేట్‌గా ఉంటుందని, అలాగే ముడతలు తగ్గుతాయని ఆమె పేర్కొన్నారు.

గుడ్లలో వీటిని కలిపి జుట్టుకు అప్లై చేస్తే చాలు- స్మూతీ హెయిర్ గ్యారెంటీ! - Eggs For Hair Health

మంట తగ్గుతుంది :
కొంతమందిలో మొటిమల సమస్య ఎక్కువగా ఉంటుంది. మొటిమలు కొద్దిగా వాపు వచ్చి, మంటతో బాధపడుతుంటారు. అయితే, ఇలాంటి సమస్యతో బాధపడేవారు నానబెట్టిన బాదం పప్పులను రోజూ తినడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. బాదంపప్పులోని యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు నొప్పిని తగ్గిస్తాయని అంటున్నారు.

యవ్వనంగా ఉండేలా చేస్తుంది :
రోజూ నానబెట్టిన బాదం పప్పులను తినడం వల్ల వయసు పెరుగుతున్న కొద్ది వచ్చే ముడతలు, మచ్చల వంటి వివిధ రకాల చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు. దీనివల్ల యవ్వనంగా కనిపిస్తామని నిపుణులు చెబుతున్నారు.

చర్మం మెరుస్తుంది :
కొంత మంది ఎన్ని సార్లు ముఖం కడుక్కున్నా కూడా వారి చర్మంపై జిడ్డుగా ఉంటుంది. అయితే, ఇలా జిడ్డు చర్మం ఉన్న వారు ఉదయాన్నే నానబెట్టిన బాదం పప్పులను తినడం వల్ల ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. ఇందులో ఉండే విటమిన్‌ బి2 జిడ్డు చర్మానికి చెక్‌ పెడుతుందని నిపుణులు చెబుతున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మీకు వచ్చే రోగాల్లో 56 శాతం - కేవలం తిండి ద్వారానే! - ICMR కీలక సూచనలు! - ICMR NIN Dietary Guidelines

Benefits of Almonds in Telugu : ఈ డ్రైఫ్రూట్ తింటే బరువు తగ్గుతారు.. ఎలా తిన్న ఏం కాదు..

ABOUT THE AUTHOR

...view details