Signs of Loneliness in a Relationship in Telugu :పెళ్లికి ముందు భార్యాభర్తల జీవితాలు భిన్నం. ఎవరి ఆలోచనలు వారివి.. ఎవరి ఇష్టాఇష్టాలు వారివి. కానీ.. వివాహానంతరం ఇద్దరూ కలిసి ఆలోచించాలి. ఇష్టాఇష్టాల్లో ఏకాభిప్రాయం రావాలి. ఉమ్మడి లక్ష్యాలు ఉండాలి. ఒకరికోసం ఒకరు అనుకున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. లేదంటే మాత్రం.. ఆ బంధం బీటలు వారే దిశగా ప్రయాణిస్తుంది. దీనికి ముందు పార్ట్నర్స్ బిహేవియర్లో మార్పులు వస్తాయి. ఫీలింగ్స్లో తేడాలు కనిపిస్తాయి. రిలేషన్లో ఉన్నా కూడా ఒంటరిగా ఉన్నామనే భావనలో ఉంటారు. ఈ పరిస్థితి ముదరకముందే.. దాన్నుంచి బయటపడాలని నిపుణులు సూచిస్తున్నారు. దానికోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
మీ పార్ట్నర్తో గొడవ పడినప్పుడు ఈ మాటలు అంటున్నారా? - అయితే విడాకులు ఖాయం!
ఒంటరితనం సంకేతాలు:
- ప్రస్తుత రోజుల్లో భార్యభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. వేర్వేరు సమయాల్లో ఉదయం ఆఫీసుకు వెళ్తుంటారు. ఇంటికి సైతం అలాగే వస్తుంటారు. ఫలితంగా కలిసి ఉండే సమయం చాలా తక్కువగా ఉంటోంది. ఈ పరిస్థితి దీర్ఘకాలం కొనసాగినప్పుడు ఒంటరి ఫీలింగ్ ఏర్పడుతుంది.
- మీరు ఇంట్లో ఉండడం కంటే.. స్నేహితులతో బయటకు వెళ్లడం వంటివే ఎక్కువగా చేస్తున్నారంటే మీరు ఒంటరితనంతో బాధపడుతున్నారని అర్థం.
- మీరు భాగస్వామికి దగ్గరగా ఉండటానికి ప్రయత్నిస్తున్నా.. వారి నుంచి స్పందన లేదని ఫీలైతే కూడా ఒంటరితనం భావాలు పెరుగుతాయి.
- ఇక ప్రస్తుత కాలంలో ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో.. కొద్దిపాటి ఫ్రీ టైమ్కూడా ఫోన్లు మింగేస్తున్నాయి. ఇది కూడా ఒంటరితనం పెంచుతుంది.
- ఉద్యోగ ఒత్తిడి కావొచ్చు.. మరొకటి కావొచ్చు.. అవి ఇంటికి మోసుకొస్తే ఇబ్బందే. వాటివల్ల భాగస్వామిపై అరవొచ్చు.. లేదంటే సరిగా మాట్లాడకపోవచ్చు. ఈ పరిస్థితి తీవ్రమైతే ఎదుటివారిలో ఒంటరి ఫీలింగ్ పెరుగుతుంది.
- ఈ కండిషన్ ముదిరినప్పుడు బాధితులు దేనిపైనా శ్రద్ధపెట్టరు. నిత్యం ముభావంగా ఉంటూ కుమిలిపోతారు. వ్యక్తిగత శుభ్రత కూడా పాటించరు. కొందరు కనీసం అద్దంలో తమను తాము చూసుకోవడం కూడా మానేస్తారు.
మీ భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నాయా? ఈ సూచనలు పాటిస్తే బంధం స్ట్రాంగ్ అవుతుంది!