Side Effects of Wearing Lipstick Regularly : అమ్మాయిలు అందంగా కనిపించడానికి రోజూ వివిధ రకాల కాస్మెటిక్ ఉత్పత్తులను వాడుతుంటారు. అందులో లిప్‌స్టిక్ ఒకటి. అయితే ఎంత మేకప్ వేసుకున్నా పెదాలకు లిప్‌స్టిక్ అప్లై చేస్తేనే పర్ఫెక్ట్ లుక్ వస్తుంది. కాగా, అవసరాన్ని బట్టి.. ఫంక్షన్లకు ఎప్పుడో ఒకసారి లిప్‌స్టిక్ వేసుకుంటే ఇబ్బంది లేదు. అలా కాకుండా రోజూ లిప్‌స్టిక్ అప్లై చేసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలువస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరి రెగ్యులర్‌గా లిప్‌స్టిక్ పెట్టుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయో ఈ స్టోరీలో చూద్దాం.
పెదాలు పొడిబారడం :మార్కెట్‌లో లభ్యమయ్యే చాలా లిప్‌స్టిక్స్‌లలో హానికరమైన రసాయనాలుంటాయి. వీటిని రెగ్యూలర్‌గా అప్లై చేసుకోవడం వల్ల పెదాలు పొడిబారతాయని నిపుణులంటున్నారు. అలాగే రోజూ లిప్‌స్టిక్ పెట్టుకోవడం వల్ల పెదాలు పగులుతాయని చెబుతున్నారు. కాబట్టి, లిప్‌స్టిక్‌ను కొనుగోలు చేసేటప్పుడు హానికరమైన కెమికల్స్ లేనివి ఎంపిక చేసుకోవాలని చెబుతున్నారు.
2016లో "Contact Dermatitis" జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం..రోజూ లిప్‌స్టిక్పెట్టుకునే మహిళల్లో పెదాలు పొడిబారడం, చికాకుకు గురయ్యే అవకాశం 3 రెట్లు ఎక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో డెర్మటాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ 'డాక్టర్ జెన్నిఫర్ ఎం. లిన్' పాల్గొన్నారు. లిప్‌స్టిక్‌లోని పదార్థాలు పెదాల సహజ రక్షణ బారియర్‌ను దెబ్బతీస్తాయని.. ఈ కారణంగా పెదాలు పొడిబారతాయి" అని వారు పేర్కొన్నారు
అలెర్జీలు :ప్రతిరోజు లిప్‌స్టిక్ అప్లై చేసుకోవడం వల్ల కొంతమందిలో అలర్జీ, దురద, వాపు, పెదాలు ఎర్రగా మారడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
మీ చర్మంపై తెల్ల మచ్చలకు కారణాలు ఇవే! - మీకు తెలుసా? - Causes For White Patches on Skin