Side Effects of Nose Picking: ఏ మాత్రం గ్యాప్ దొరికినా కొంతమంది పదేపదే ముక్కులో వేలు పెట్టుకుంటుంటారు. ముక్కు దురద పెడుతుందనో.. ముక్కు శుభ్రం చేయడానికనో.. ఇలా రకరకాల కారణాల వల్ల ముక్కులో వేలు పెట్టి తిప్పుతూ ఉంటారు. అయితే.. ముక్కులో వేలు పెట్టుకునే అలవాటు ఉన్న వాళ్లు.. కేవలం ఎవరో ఏదో అంటారని కాకుండా.. తమ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడే ఈ అలవాటు వదిలేయాలని నిపుణులు చెబుతున్నారు. ఈ అలవాటు చాలా ప్రమాదకరమైనదని హెచ్చరిస్తున్నారు. అల్జీమర్స్, డిమెన్షియా వంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.
అల్జీమర్స్:ముక్కులో వేలు పెట్టుకోవడం వల్ల.. ప్రమాదకరమైన వైరల్, బ్యాక్టీరియల్, ఫంగల్ పాథోజెన్ల లాంటివి ముక్కు ద్వారా మెదడులోకి చేరి ఇన్‌ఫ్లమేషన్‌కు దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇది క్రమ క్రమంగా మన ఆలోచలు, జ్ఞాపకశక్తి, భాషపైనా ప్రతికూల ప్రభావం చూపుతుందని.. మెదడు జీవక్రియనూ, జీర్ణప్రక్రియ- మెదడు సంబంధాలను నియంత్రించి ఆల్జీమర్స్‌కి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.
ఈ దురలవాటు ఆల్జీమర్స్ వ్యాధికి కారణమవుతుందని 2023లో వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీలో చేసిన పరిశోధనల్లో కూడా వెల్లడైంది. వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు.. ముక్కులో వేలు పెట్టి తిప్పడం, ఆల్జీమర్స్ వ్యాధి మధ్య సంబంధాన్ని అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో 200 మంది పెద్దలను పరీక్షించారు. వారిలో 100 మందికి ఆల్జీమర్స్ వ్యాధి ఉందని.. మరో 100 మందికి లేదని కనుగొన్నారు.
నోరు లేదా ముక్కు నుంచి దుర్వాసన వస్తోందా? - ఈజీగా తగ్గించుకోండిలా! - Mouth Bad Breath Causes
ఇదే అంశంపై ఎలుకలపై కూడా అధ్యయనాలు చేశారు. ముక్కులోని ఘ్రాణ నాడి ద్వారా ఒక సూక్ష్మజీవి ఎలుకల మెదడులోకి ప్రవేశిస్తాయని నిపుణులు అంటున్నారు. మెదడులోకి ప్రవేశించిన తర్వాత, అవి అమిలాయిడ్ బీటా ప్రోటీన్ నిక్షేపణను ప్రేరేపిస్తాయని ఇది అల్జీమర్స్ అభివృద్ధికి దారితీస్తుందని ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ యూనివర్సిటీ పరిశోధకులు నిరూపించారు. అలాగే జ్ఞాపకశక్తి కోల్పోవడం, భాషా సమస్యలు, గ్రహణశక్తి మరియు అనూహ్య ప్రవర్తన వంటి వ్యాధి యొక్క అనేక లక్షణాలకు కారణమయ్యే అమిలాయిడ్-బీటా ఫలకాలను ఏర్పరుస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.