Can Drinking Beer Cause Weight Gain? :బీరు.. నేటి జనరేషన్ యువత ఎక్కువగా ఇష్టపడే ఆల్కహాలిక్ పానీయాల్లో ఒకటి. ఇంటికి బంధువు వచ్చినా.. ఫ్రెండ్ కలిసినా.. ఆనందంలో ఉన్నా.. విషాదంలో ఉన్నా.. ఇలా సందర్భమేదైనా బీరు పొంగాల్సిందే. అయితే, చాలా మందికి బీరు(Beer)తాగితే బరువు పెరుగుతారా అనే సందేహం వస్తుంది. మరి ఇందులో నిజమెంత? దీనిపై వైద్య నిపుణులు ఏం అంటున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
'బీరు తాగితే బరువు పెరుగుతారా?' అనే ప్రశ్నకు వైద్య నిపుణులు ఈ విధంగా సమాధానం ఇస్తున్నారు. అన్ని ఆల్కహాలిక్ పానీయాల మాదిరిగానే బీర్లలో కేలరీలు ఉంటాయంటున్నారు. ముఖ్యంగా కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ఆల్కహాల్ కంటెంట్ ఉంటాయి. అయితే, బీర్లలో ఆల్కహాల్ కంటెంట్ అనేది దానిలో వాడే పదార్థాలు, బ్రూయింగ్ ప్రక్రియ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. దీన్ని బట్టి బీర్లో కేలరీల శాతం మారుతూ ఉంటుందని సూచిస్తున్నారు.
సాధారణంగా 355ml ఉండే బీర్లో దాదాపు 150 కేలరీలు ఉండవచ్చని చెబుతున్నారు. అయితే, ఇది క్రాఫ్ట్ బీర్లు, స్టౌట్‌లలో మరింత ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుందంటున్నారు. కాబట్టి, బీర్ మితంగా తాగితే ప్రమాదం లేదంటున్నారు నిపుణులు. అలాగే మితమైన బీర్ వినియోగం నేరుగా బరువు పెరగడానికి దారితీయకపోవచ్చంటున్నారు. అలాకాకుండా బీర్ అధికంగా తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి మంచి కాదని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో కేలరీలు పెరగడానికి దోహదం చేస్తుంది. ఫలితంగా ఇది కాలక్రమేణా బరువు పెరగడానికి దారి తీస్తుందని చెబుతున్నారు.
బీరు తాగితే కిడ్నీ స్టోన్స్ బయటకు వచ్చేస్తాయా? - ఇందులో నిజమెంత? - నిపుణుల సమాధానమిదే!