ETV Bharat / health

టైప్ 2 డయాబెటిస్​తో భయం ఎందుకు? సింపుల్ టిప్స్​తో షుగర్ కంట్రోల్ చేయండిలా! - HOW TO CONTROL BLOOD SUGAR LEVELS

-రక్తంలో చక్కెర స్థాయులు అదుపు చేసుకోండిలా! -వాకింగ్, వ్యాయామాలతో పాటు ఇవి చేయాలట!

How to Control Sugar Levels in Blood
How to Control Sugar Levels in Blood (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : Jan 19, 2025, 4:09 PM IST

How to Control Sugar Levels in Blood: ఇటీవల కాలంలో ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య టైప్ 2 డయాబెటిస్. ఇది రక్తంలో చక్కెర స్థాయులను పెంచడంతో పాటు వివిధ అనారోగ్యాలను తెచ్చిపెడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ మధుమేహానికి జీవనశైలి ఒక కారణమైతే.. తల్లిదండ్రుల డీఎన్​ఏ మరో కారణమని అంటున్నారు. తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోయినా, శరీరం ఇన్సులిన్​ను సరిగ్గా వినియోగించకపోయినా టైప్ 2 డయాబెటిస్ వస్తుందని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మనలో ఒత్తిడిని పెంచే కార్టిసాల్ హార్మోన్ ఉత్పత్తి పెరిగితే.. అది రక్తంలో చక్కెర స్థాయులను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఒత్తిడిని తగ్గించే ప్రయత్నాలు చేయాలని సూచిస్తున్నారు. ఇందుకోసం యోగా, ధ్యానం చేయాలని సలహా ఇస్తున్నారు. ఎవరికైనా శారీరక శ్రమ అవసరమని చెబుతున్నారు. అందుకోసం క్రమం తప్పకుండా వాకింగ్, వ్యాయామాలు చేయాలని సూచిస్తున్నారు. ఫలితంగా గ్లూకోజ్ ఉత్పత్తి తగ్గి.. రక్తంలో చక్కెర స్థాయులు అదుపులోకి వస్తాయని వివరిస్తున్నారు.

ముఖ్యంగా శరీరంలో తగినంత నీరు ఉండడం వల్ల పోషకాలను గ్రహిస్తుందని నిపుణులు అంటున్నారు. దీని వల్ల అనారోగ్యాలు దరిచేరకుండా ఉంటాయని వివరిస్తున్నారు. హైడ్రేటెడ్​గా ఉండడం వల్ల టైప్ 2 డయాబెటిస్ దరిచేరే అవకాశం కూడా తక్కువని నిపుణులు చెబుతున్నారు. ఏ వయసు వారికైనా కనీసం 8 గంటల నిద్ర అవసరమని నిపుణులు తెలిపారు. ఎందుకంటే శరీరం దెబ్బతిన్న కణాలను నిద్రలోనే పునరుద్ధరించుకుంటుందని వివరిస్తున్నారు. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయులు అదుపులోకి వస్తాయని అంటున్నారు.

ఇంకా ఫైబర్ అధికంగా ఉన్న ఆహారంతో పాటు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటి ద్వారా రక్తంలో చక్కెర స్థాయులు అదుపులోకి వస్తాయని వివరిస్తున్నారు. ఇంకా తృణధాన్యాలు, ఓట్స్, బార్లీ, పొట్టుతో కూడిన పప్పుల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. దానిమ్మ, యాపిల్ వంటి పండ్లను కూడా మితంగా తీసుకోవచ్చని వెల్లడిస్తున్నారు. 2017లో Journal of Nutritionలో ప్రచురితమైన "The Impact of Low-Glycemic Index Fruits on Blood Sugar Control in Healthy Adults: A Randomized Controlled Trial" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

నీరసం, వేడి ఆవిర్లతో ఇబ్బంది పడుతున్నారా? మెనోపాజ్​లో ఇవి తింటే ఆరోగ్యంగా ఉంటారట!

'జొన్న రొట్టెలు తింటే షుగర్ కంట్రోల్​'- అధిక బరువు, గుండె సమస్యలకు చెక్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.