Home Remedies to Get Rid from Cold:వర్షాకాలంలో తరచు కురిసే జల్లులు, జోరు వానాలతో.. వాతావారణం ఆహ్లాదకరంగా, చల్లగా మారిపోతుంది. అయితే వాతావరణం మారగానే.. చాలా మంది జలుబు, తుమ్ములు, గొంతు నొప్పి వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. వెంటనే డాక్టర్ల దగ్గరకు పరుగులు తీస్తారు. అయితే, ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు ఆందోళన చెందకుండా.. ఈ టిప్స్ పాటిస్తే సేఫ్‌గా ఉండొచ్చని నిపుణులు అంటున్నారు. ఆ చిట్కాలు మీ కోసం..
తులసి ఆకులు, నల్ల మిరియాల పొడి :తులసి ఆకులు వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాబట్టిఒక కప్పు నీళ్లలో కొన్ని తులసి ఆకులు, నల్ల మిరియాల పొడి వేసుకుని బాగా మరిగించాలి. గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఈ నీటిని తాగడం వల్ల జలుబు, తుమ్ములు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
శరీరం చెమట కంపు కొడుతోందా? - వాడాల్సింది సెంటు కాదు..!
గోరువెచ్చని పాలు:వర్షాకాలంలో జలుబు, తుమ్ములు వంటి ఇతర సమస్యలతో బాధపడుతుంటే.. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగితే సమస్యలు పరారవుతాయని అంటున్నారు. పసుపులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఈ లక్షణాలను తగ్గిస్తాయని నిపుణులు పేర్కొన్నారు.
ఆవిరి పట్టడం :ఎక్కువ మందికి వర్షంలో తడవగానే తుమ్ములు వస్తుంటాయి. ఆపై జలుబు స్టార్ట్ అవుతుంది. కాబట్టి, జలుబు చేసినప్పుడు ఆందోళన చెందకుండా ఆవిరి పట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. మరిగే నీటిలో చిటికెడు పసుపు వేసుకుని ఆవిరి పడితే మంచి ప్రయోజనం ఉంటుందని.. అలాగే తలనొప్పి కూడా తగ్గుతుందని అంటున్నారు.
2010లో చైనా జర్నల్ ఆఫ్ నర్సింగ్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం ఆవిరి పట్టడం వల్ల జలుబు, తుమ్ములు వంటివి తగ్గుతాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో చైనాలోని నాన్జింగ్ మెడికల్ యూనివర్సిటీలో శ్వాసకోశ వైద్య నిపుణుడు "డాక్టర్ X. Wang" పాల్గొన్నారు.