Prevent Brain Stroke With Lifestyle Changes :బ్రెయిన్లో రక్తం గడ్డకట్టడం వల్ల రక్తనాళాలు మూసుకోయి రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడే ప్రాణాంతక పరిస్థితినే బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. ఇది రావడానికి ముందు ముఖం ఒకవైపు, ఒక చేయి తిమ్మరిగా, లాగినట్టుగా అనిపించడం, మాటలో స్పష్టత కోల్పోవడం, తలనొప్పి, కళ్లు తిరగడం,దృష్టి సమస్యలు లాంటి లక్షణాలను కనిపిస్తాయి. వీటిని మొదటి దశలోనే గుర్తించి వైద్యుని సంప్రదిస్తే సమస్య ప్రాణాంతకం కాకుండా ఉంటుంది. అలా కాకుండా బ్రెయిన్ స్ట్రోక్ నుంచి ముందుగానే తప్పించుకోవాలంటే మీ జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవేంటో చూద్దాం
1. రక్తపోటు నియంత్రణ
అధిక రక్తపోటుతో బాధపడే వారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి రక్తపోటు సమస్య ఉన్నవారు ఆహారంలో ఉప్పు తగ్గించి తినాలి. అలాగే అధిక కొవ్వు కలిగిన ఆహారాలకు దూరంగా ఉండి రక్తపోటును ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాలి.
2.వ్యాయామాం
మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే శారీరకంగా చురుగ్గా ఉండటం తప్పనిసరి. ముఖ్యంగా మెదడుకు రక్త ప్రసరణ మెరుగ్గా జరగాలి. ఇందుకోసం బ్రెయిన్‌కు రక్త ప్రసరణ జరగడానికి ఉపయోగపడే యోగాసనాలు, వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయడం అలవాటు చేసుకోవాలి.
3.బరువు నియంత్రణ
అధిక రక్తపోటుతో పాటు ఊబకాయం సమస్య కూడా బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి దారితీస్తుంది. కాబట్టి మీ ఆహారం విషయంలో తప్పకుండా జాగ్రత్తలు వహించాలి. బరువును నియంత్రించుకోవడం ద్వారా బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుంది.