Potato Vs Sweet Potato For Diabetes : ప్రస్తుతం చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య మధుమేహం. ఈ వ్యాధితో బాధపడుతున్నవారు ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ముఖ్యంగా వారు తినే ఆహరాల్లో చాలా పరిమితులు ఉంటాయి. షుగర్ బాధితులు ఎల్లప్పుడూ రక్తంలో చెక్కర స్థాయిలను అదుపులో ఉంచుకోవాలి. లేదంటే వారి రక్తనాళలు దెబ్బతింటాయి. దాని ప్రభావం గుండె, మూత్రపిండాలపై పడుతుంది. నరాల పనితీరు కూడా క్షీణించి తిమ్మిర్లు లాంటి సమస్యలు వస్తాయి. కంటి చూపు కూడా తగ్గిపోతుంది. అందుకే చక్కెర స్థాయిలను ప్రభావితం చేసే ఆహారాలను షూగర్ ఉన్నవాళ్లు తీనకూడదు. అలాగే డైట్ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
అయితే చాలా మంది షుగర్ పేషెంట్స్‌కు దుంపలు చాలా మంచివి అంటుంటారు. బంగాళదుంపలు సరే కానీ చిలకడదుంపలు కాస్త తియ్యగా ఉంటాయి. అందుకే మధుమేహం వ్యాధి ఉన్నవారు వాటిని తినకూడదని కొందరి వాదన. లేదు రెండూ దుంపలే కదా రెండింటినీ తినచ్చని ఇంకొందరి మాట. ఇంతకీ షూగర్ పేషెంట్స్ బంగాళదుంపలు, చిలకడదుంపలు తినొచ్చా? వీటిలో ఏది మంచిదో తెలుసుకుందాం.
నిజానికి బంగాళాదుంపలు, చిలకడదుంపలు రెండూ భూగర్భంలో పెరిగేవే. అలాగే రెండింటింలోనూ కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. కానీ పోషక విలువల విషయానికొస్తే మాత్రం కచ్చితంగా వేర్వేరుగా ఉంటాయి.
చిలకడదుంపలో ఉండే పోషకాలు
బంగాళాదుంపలతో పోలిస్తే చిలకడదుంపల్లో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కవగా ఉంటుంది. వీటిలో కార్బన్, కేలరీల శాతం కూడా తక్కువే. మెత్తగా, మృదువుగా ఉండే స్వీట్ పొటాటోలో పీచు, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, విటమిన్-ఏ ఎక్కువగా ఉంటాయి. షుగర్ పేషెంట్లు చిలకడ దుంపలను తినడం వల్ల శరీరంలో గ్లూకోజ్ లెవల్స్, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. చిలకడదుంపలో సమృద్ధిగా దొరికే కెరోటినాయిడ్స్, విటమిన్లు, ఖనిజాలు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. శరీరానికి హానికరమైన కొవ్వును తగ్గించి గుండెను పదిలంగా కాపాడటం, క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. వీటిని ఉడికించుకుని లేదా కాల్చుకుని మాత్రమే తినగలం. పెద్దవాళ్లు చాలామంది చిలకడదుంపల్ని పచ్చిగానే తింటుంటారు.
బంగాళాదుంప ప్రయోజనాలు
బంగాళాదుంపల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. దీంతో పాటు కొన్ని రకాల బి-కాంప్లెక్స్ విటమిన్లు కూడా పుష్కలంగా దొరుకుతాయి. వీటిలోని కార్బోహైడ్రేట్లు శక్తికి వనరులుగా చెప్పవచ్చు. ఇవన్నీ శరీరానికి మేలు కలిగించే అంశాలే. అయితే చిలకడదుంపల్ని కేవలం ఉడికించుకుని మాత్రమే తినగలం. వాటిని నూనెలో వేయించినా, వండినా అవి వాటి పోషకాలను కోల్పోయి. అలాగే హానికరమైనవి మారతాయి. కానీ తెల్ల బంగాలాదుంపల్ని కూర వండుకుని, నూనెలో వేయించుకుని చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ అంటూ రకరకాలుగా తినే అవకాశాలున్నాయి.