Winter Skin Care Tips; వాతావరణ మార్పుల వల్ల మన ఆరోగ్యం, అందం దెబ్బతింటుంది. ఈ క్రమంలోనే ముఖ్యంగా చలికాలంలో సౌందర్య పరిరక్షణ మరింత సవాలుగా మారుతుుంది. పొడి చర్మం, జుట్టు నిర్జీవమవడం, పాదాల పగుళ్లు వంటి సమస్యలను ఈ కాలంలో చాలామంది ఎదుర్కొంటుంటారు. వీటి నుంచి తప్పించుకోవడానికి అనేక ప్రయత్నాలుచేస్తుంటారు. మరి, ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి ఈ చిట్కాలు మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
స్క్రబ్‌తో పోషణ!
చలి వల్ల చర్మం పొడిబారిపోయి గరుకుగా మారిపోతుంది. తిరిగి చర్మాన్ని మృదువుగా మార్చుకునేందుకు చాలామంది స్క్రబ్బింగ్ పద్ధతిని పాటిస్తుంటారు. ఇందుకోసం దాల్చినచెక్క, తేనె రెండూ కలిపిన మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేసి కాసేపు మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి పోషణ అందడంతో పాటు మృతకణాలూ తొలగిపోతాయని నిపుణులు అంటున్నారు. అలాగే దాల్చిన చెక్క శరీరంలో వేడిని పుట్టించడానికీ తోడ్పడుతుందని చెబుతున్నారు.
మెడపై సుతారంగా
చలికాలంలో అటు వెచ్చదనాన్ని పంచడంతో పాటు ఇటు చర్మాన్ని మృదువుగా మార్చే పదార్థాల్లో గుమ్మడి ఒకటని నిపుణులు చెబుతున్నారు. దీని గుజ్జుతో ముఖం, మెడపై సుతారంగా మసాజ్ చేసుకోవడం వల్ల పొడిబారిన చర్మం తిరిగి మృదువుగా మారుతుందని వివరిస్తున్నారు. ఇందులోని ఎంజైమ్స్, బీటా కెరోటిన్ ఈ పనిని మరింత సమర్థంగా పూర్తి చేస్తాయని పేర్కొన్నారు.
జుట్టుకు వెన్న!
ఇంకా చలికాలంలో చర్మమే కాకుండా.. జుట్టు కూడా తేమను కోల్పోయి నిర్జీవంగా మారిపోతుంది. అయితే, దీనిని ఇలానే నిర్లక్ష్యం చేస్తే జుట్టు రాలిపోవడం, చుండ్రు వంటి సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ సమస్యలకు ఇంట్లో లభించే వెన్న చక్కటి పరిష్కారం చూపుతుందని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం వెన్నను కుదుళ్లకు పట్టించి అరగంట పాటు షవర్ క్యాప్ పెట్టుకోవాలని చెబుతున్నారు. ఆపై గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే కుదుళ్లు తేమను సంతరించుకుంటాయని వివరిస్తున్నారు. 2011లో Journal of Cosmetic Scienceలో ప్రచురితమైన "Shea Butter: A Natural Hair Moisturizer" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. ఇందులో దిల్లీ ఐఐటీ ప్రొఫెసర్ A. K. S. Rawat పాల్గొన్నారు. ఫలితంగా కుదుళ్లలో సహజసిద్ధమైన నూనెలు ఉత్పత్తై జుట్టూ తేమగా మారి పట్టులా మెరిసిపోతుందని అంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
కళ్ల కింద క్యారీ బ్యాగులు వచ్చాయా? ఇలా చేస్తే ఈజీగా పోతాయట!
మీ స్టెంట్స్ సరిగ్గా పని చేస్తున్నాయా? గుండె పేస్మేకర్ ఎంత కాలం పనిచేస్తుంది?