RC 16 Movie Update : గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ - బుచ్చిబాబు సానా కాంబోలో 'ఆర్‌సీ 16' (వర్కింగ్ టైటిల్) సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. తాజాగా సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ చిత్రం నుంచి ఓ అప్డేట్ షేర్ చేశారు. ప్రస్తుతం చిత్రీకరణ మైసూర్లో జరుగుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు షూటింగ్ సెట్లోని ఓ ఫొటో షేర్ చేశారు.
రత్నవేలు పోస్ట్ చేసిన ఫొటో చూస్తుంటే రాత్రి వేళల కూడా షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. 'మైసూర్లో జరుగుతున్న RC16 షూటింగ్లో భాగంగా, 'రంగస్థలం' తర్వాత రామ్‌చరణ్‌తో కలిసి పనిచేస్తున్నా. మంచి టీమ్‌తో కలిసి వర్క్ చేయడం ఆనందంగా ఉంది' అని పోస్ట్‌కు రాసుకొచ్చారు. అయితే రత్నవేలు లాంటి సినిమాటోగ్రాఫర్ ఆర్‌సీ 16కు పనిచేడయం వల్ల ఫ్యాన్స్‌లో అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఎట్టకేలకు ఈ సినిమా నుంచి అప్డేట్ రావడం వల్ల కూడా ఫ్యాన్స్ కూడా సంతోష పడుతున్నారు.
During #RC 16 shoot in Mysore …
— Rathnavelu ISC (@RathnaveluDop) December 24, 2024
Exciting to collaborate with @AlwaysRamCharan bro after Rangasthalam 🔥@BuchiBabuSana @arrahman @RathnaveluDop @vriddhicinemas @MythriOfficial @SukumarWritings pic.twitter.com/zxd4sRwmO3
కాగా, తన తొలి సినిమా 'ఉప్పెన'తోనే డైరెక్టర్ బుచ్చిబాబు జాతీయ పురస్కారం దాకా వెళ్లారు. ఇది 2023 ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచింది. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై కూడా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఆయన అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం బుచ్చిబాబు దాదాపు రెండేళ్ల నుంచి వర్క్ చేస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా, గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది.
ఇందులో రామ్‌చరణ్ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండనుంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్గా నటించనుంది. కన్నడ స్టార్ నటుడు శివరాజ్‌కుమార్ కీలక పాత్ర పోషించనున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రెండు పాటలు సైతం అయ్యాయని టాక్. ఇక మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంస్థలు కలిసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఈ చిత్రానికి 'పెద్ది' అనే టైటిల్ ప్రచారంలో ఉంది.
Wishing Everyone a Happy Diwali ❤️#RC16 Journey Begins Soon… 🔥 pic.twitter.com/72pDGAuJxy
— BuchiBabuSana (@BuchiBabuSana) October 31, 2024
RC16 షూటింగ్ అప్డేట్ - ఆ రోజు నుంచే ప్రారంభం! - RC 16 Movie Shooting Update