తెలంగాణ

telangana

ETV Bharat / health

స్నానం చేసేటప్పుడు మూత్ర విసర్జన చేస్తే ఏమవుతుంది?

Peeing While Bathing Is Good Or Bad : స్నానం చేసేటప్పుడు కొందరు మూత్ర విసర్జన చేస్తుంటారు! అయితే.. ఈ అలవాటు మంచిదేనా అని సందేహం కలుగుతుంటుంది. మరి దీనిపై నిపుణులు ఏమంటున్నారు?

Peeing While Bathing Is Good Or Bad
Peeing While Bathing Is Good Or Bad

By ETV Bharat Telugu Team

Published : Feb 26, 2024, 1:52 PM IST

Peeing While Bathing Is Good Or Bad : మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. మంచి ఆహారం తీసుకోవాలని అందరికీ తెలుసు. అయితే.. ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో, పరిశుభ్రంగా ఉండటం కూడా అంతే ముఖ్యం. అప్పుడే పలు రకాల వ్యాధుల బారిన పడకుండా ఉంటాం. ఇందుకోసం మనం రోజూ శుభ్రంగా స్నానం చేస్తుంటాం. అయితే.. కొంత మంది స్నానం చేసేటప్పుడు మూత్ర విసర్జన చేస్తుంటారు. మరి.. ఇలా స్నానం చేసేటప్పుడు మూత్ర విసర్జన చేయడం మంచిదేనా? అనే సందేహం కలుగుతుంటుంది. దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

మలినాలు తొలగిపోతాయి :
మన శరీరంపైన ఉన్న మలినాలన్నీ తొలగిపోవాలంటే స్నానం చేయడం చాలా ముఖ్యం. దీనివల్లే శరీరంపై ఉన్న చెమట, బ్యాక్టీరియా తొలగిపోతాయి. తద్వారా దుర్వాసన కూడా తొలగిపోతుంది. అయితే.. స్నానం చేస్తున్నప్పుడు మూత్ర విసర్జన చేయడం మంచిదేనా అంటే.. కొన్ని సందర్భాల్లో కాదని చెబుతున్నారు. మూత్రంలో పలురకాల మలినాలు ఉంటాయి. మరికొందరిలో ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఇలాంటి వారు మూత్రం విసర్జించినప్పుడు.. కాళ్లకు పుండ్లు, గాయాలు ఉంటే.. వాటికి ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

అదేవిధంగా.. కొందరు బాత్ టబ్​లో స్నానం చేస్తుంటారు. నిండుగా ఉన్న సబ్బు నీటిలోకి దిగి వీరు స్నానం చేస్తుంటారు. ఇలాంటి వారు అందులో మూత్రం విసర్జిస్తే.. అది ఆ నీటిలోనే కలిసిపోయి నీటిని కలుషితం చేస్తుంది. అది ఒళ్లు మొత్తానికి అంటుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ రావొచ్చు. అయితే కొంత మంది అథ్లెట్ల పాదాల నుంచి ఫంగస్, బ్యాక్టీరియాను తొలగించడానికి పాదాలను మూత్రంతో తడుపుతారట. అలాగే ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో నీటి కొరత చాలా ఉంది. అక్కడ చాలా మంది స్నానం చేసేటప్పుడు మూత్రవిసర్జన చేస్తారు. దీనివల్ల నీటి కొరత నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే.. ఒకవేళ విడిగా మూత్రం విసర్జిస్తే.. మళ్లీ ఫ్లష్‌ చేడానికి నీళ్లు వాడాల్సి ఉంటుంది. ఎలాంటి సమస్యలూ లేకపోతే.. స్నానం చేస్తున్నప్పుడు యూరిన్ చేస్తే ఇబ్బంది లేదని నిపుణులు సూచిస్తున్నారు.

గోరువెచ్చని నీటితో..
స్నానం చేయడానికి ప్రతిరోజూ గోరువెచ్చని నీటిని వాడటం మంచిదని నిపుణులంటున్నారు. దీనివల్ల శరీరానికి కొత్త ఉత్సహం కలుగుతుందని తెలియజేస్తున్నారు. అయితే.. స్నానం చేసేటప్పుడు నీరు ఎక్కువ వేడిగా ఉండకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే కొంత మందికి తిన్న తర్వాత స్నానం చేసే అలవాటు ఉంటుంది. అయితే, ఇలా చేయడం వల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉంటాయట. కాబట్టి, రోజూ ఉదయం, సాయంత్రం తినకముందు స్నానం చేయాలని సూచిస్తున్నారు.

ఈ వస్తువులను బాత్రూమ్​లో ఉంచుతున్నారా? - మీ గుండెకు ముప్పు తప్పదు!

గర్భనిరోధక మాత్రలు వాడితే బరువు పెరుగుతారా? వైద్యులు ఏం చెబుతున్నారు?

బరువు తగ్గడం నుంచి షుగర్ కంట్రోల్ దాకా - మెంతులతో సూపర్​ బెనిఫిట్స్ ఎన్నో​!

ABOUT THE AUTHOR

...view details