తెలంగాణ

telangana

ETV Bharat / health

బ్రష్ చేసేటప్పుడు ఈ మిస్టేక్స్‌ చేస్తున్నారా? - మీ దంతాల పని అయిపోయినట్టే! - Mistakes Brushing Teeth - MISTAKES BRUSHING TEETH

Mistakes Brushing Teeth : దంతాలు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామని వైద్యులు పదే పదే చెబుతుంటారు. కానీ.. చాలా మంది జనాలు దంతాలను శుభ్రం చేసే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు! దీనివల్ల చాలారకాల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముందని నిపుణులంటున్నారు. అందుకే.. బ్రష్‌ చేసేటప్పుడు ఈ మిస్టేక్స్ చేయొద్దంటున్నారు.

Mistakes Brushing Teeth
Mistakes Brushing Teeth

By ETV Bharat Telugu Team

Published : Mar 22, 2024, 3:46 PM IST

Mistakes Brushing Teeth : ప్రస్తుత కాలంలో చాలా మంది జనాలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నప్పటికీ.. దంతాల విషయానికి వస్తే మాత్రం కొంత నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. దీనివల్ల నోటి దుర్వాసన, చిగుళ్ల నుంచి రక్తం వంటి పలు రకాల దంత సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరి.. ఈ పరిస్థితికి కారణమేంటె తెలుసా?

గట్టిగా రుద్దకూడదు :
కొంతమంది బ్రష్ నిండా పేస్ట్‌ వేసుకుని దంతాలను చేపను రుద్దినట్టు రుద్దుతుంటారు. ఇలా చేస్తేనే దంతాలు తళతళా మెరుస్తాయనుకుంటారు. కానీ, ఇలా రుద్దడం వల్ల పళ్లపై ఉండే ఎనామిల్‌ పొర తొలగిపోతుంది. అలాగే ఇతర నోటి సమస్యలు కూడా వస్తాయట. అందుకే.. సరైన పద్ధతిలో రెండు నుంచి మూడు నిమిషాలు బ్రష్‌ చేయాలని సూచిస్తున్నారు.

దంత సమస్యలు వేధిస్తున్నాయా?.. ఈ చిట్కా పాటించండి!

హార్డ్‌ టూత్‌ బ్రష్‌ :
కొంత మందికి దంతాలను శుభ్రపరచుకోవడానికి ఏ బ్రష్‌ వాడాలో అవగాహన ఉండకపోవచ్చు. ఇలాంటి వారు షాపుల్లో దొరికే హార్డ్‌ టూత్‌ బ్రష్‌లను వాడుతుంటారు. అయితే, దీర్ఘకాలికంగా హార్డ్‌ బ్రష్‌కి ఉండే గరుకైన బ్రిజిల్స్‌తో క్లీన్‌ చేసుకోవడం వల్ల పళ్లపై ఉంటే ఎనామిల్‌ పొర తొలగిపోతుందట. అందుకే సాఫ్ట్‌, మీడియమ్‌ బ్రష్‌లను వాడాలి. అలాగే మంచి జెల్‌ ఉండే ఫ్లోరైడ్‌ టూత్‌పేస్ట్‌ను ఉపయోగించాలి.

రెండుసార్లు బ్రష్ చేయడం లేదు :
మెజార్టీ జనాలు సమయం లేకపోవడం వల్లనో లేదా బద్ధకం కారణంగానో రోజుకి ఒక్కసారే బ్రష్‌ చేస్తుంటారు. అయితే.. నైట్‌ టైమ్‌లో బ్రష్‌చేయకపోవడం వల్ల నోటిలో బ్యాక్టీరియా ఏర్పడి సమస్యలు వస్తాయి. అందుకే రోజూ ఉదయం, రాత్రి పడుకునే ముందు తప్పకుండా బ్రష్‌ చేయాలి. 2019లో "జర్నల్ ఆఫ్ క్లినికల్ పీరియాంటోలాజీ" ప్రచురించిన నివేదిక ప్రకారం.. రోజుకి రెండుసార్లు బ్రష్‌ చేసిన వారిలో చిగుళ్ల వ్యాధి వచ్చే అవకాశం 27 శాతం తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారట. ఈ పరిశోధనలో 400 మందిని రెండు గ్రూప్‌లుగా చేసి 2 సంవత్సరాల పాటు పరిశీలించారు. అలాగే రోజూకు రెండుసార్లు పళ్లు తోముకున్న వారిలో మిగతా వారితో పోల్చిచూస్తే చిగుళ్ల నుంచి రక్తస్రావం కావడం తగ్గిందట.

ఇంకా :

  • అలాగే చక్కెర పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల కూడా దంతాలు పాడైపోతాయి.
  • ధూమపానం, పొగాకు ఉత్పత్తులను నమలడం వంటి చెడు అలవాట్ల వల్ల దంతాలు పాడైపోతాయి.
  • ఆమ్ల స్వభావం ఉండే డ్రింక్స్‌, ఆహార పదార్థాలను ఎక్కువగా తినడం వల్ల దంతాలపై ఉండే ఎనామిల్‌ కోతకు గురవుతుంది.
  • కొంత మంది తిన్న తర్వాత పళ్లలో ఇరుక్కున్న పదార్థాలను తొలగించడానికి టూత్‌పిక్‌లను వాడుతుంటారు. కానీ, ఇలా చేయకుండా ఫ్లాసింగ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
  • మనలో చాలా మంది బ్రష్‌ చేసిన తర్వాత వెంటనే మౌత్‌ వాషను ఉపయోగిస్తుంటారు.
  • మూడు వారాల కంటే ఎక్కువగా మౌత్‌వాష్‌ను వాడటం వల్ల దంతాలపై మరకలు పడతాయట. అందుకే వైద్యులు సూచించిన ప్రకారం మాత్రమే వాడాలి.
  • ఎక్కువ రోజులు ఒకే బ్రష్‌ వాడకూడదు. కనీసం 3 నెలలకు ఒకసారి కొత్తది వాడాలి.
  • ఆరు నెలలకు ఒకసారి డెంటిస్ట్‌ను సంప్రదించాలి.
  • గర్భిణీలలో హార్మోన్ల మార్పుల కారణంగా చిగుళ్ల వాపు వంటి ఇతర దంత సమస్యలు వస్తాయి. కాబట్టి, వీరు అజాగ్రత్తగా ఉండకూడదు.

NOTE : ఈ వెబ్ సైట్ లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

గర్భిణుల్లో దంత సమస్యలు - బిడ్డకూ ఎఫెక్ట్ - ఎలా నివారించాలి?

DENTAL PROBLEMS: మాస్కు వాడకంతో ఆ సమస్య పెరుగుతోంది.. గమనించారా?

ABOUT THE AUTHOR

...view details